Rain in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం..
Rain in Hyderabad: ఎండ వేడిమితో అల్లాడిపోతున్న హైదరాబాద్ ప్రజలకు బిగ్ రిలీఫ్ లభించింది. నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
Rain in Hyderabad: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, హబ్సిగూడ, అంబర్‌పేట, విద్యానగర్, రామంతపూర్, ఉప్పల్, ఘట్‌కేసర్, నాచారం, మల్లాపూర్, మలక్‌పేట, చైతన్యపురి, సరూర్ నగర్‌లలో భారీ వర్షం కురిసింది.
ఇప్పటికీ నగరంలోని పలుచోట్ల వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. సాయంత్రం అంతా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో పలుచోట్ల కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్లు తెలుస్తోంది. దీంతో వడగాల్పులు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న జనాలకు పెద్ద ఉపశమనం కలిగినట్లయింది.
కాగా, ఈసారి మార్చి రెండో వారం నుంచే ఎండలు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిన్నటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదువతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఎండల భయానికి మధ్యాహ్నం 12 తర్వాత జనం ఇళ్లల్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయట పెట్టట్లేదు.
Also Read: AC offers: అమెజాన్ సమ్మర్ స్పెషల్ ఆఫర్స్- ఏసీలపై సూపర్ కూల్ డిస్కౌంట్స్
Also read: Gmail Offline: ఇకపై ఇంటర్నెట్ లేకుండానే మెయిల్స్ సెండ్ చేయవచ్చు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook