Gmail Offline: ఇకపై ఇంటర్నెట్ లేకుండానే మెయిల్స్ సెండ్ చేయవచ్చు!!

Gmail Offline: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నెటిజన్లు మెయిల్స్ సెండ్ చేసుకునేందుకు Gmail ఖాతాలను ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇంటర్నెట్ ను ఉపయోగిస్తూ ఇలా మెయిల్స్ సెండ్ చేయవచ్చు. కానీ, ఇంటర్నెట్ లేకుండానే అంటే ఆఫ్ లైన్ ద్వారా Gmail ఖాతా నుంచి సందేశాలు పంపవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2022, 01:53 PM IST
Gmail Offline: ఇకపై ఇంటర్నెట్ లేకుండానే మెయిల్స్ సెండ్ చేయవచ్చు!!

Gmail Offline: Gmail ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ మెయిల్స్ లో ఒకటి. అయితే వృత్తిపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కమ్యూనికేషన్ కోసం Gmail అకౌంట్స్ ను వినియోగిస్తున్నారు. ఈ మెయిల్ కు సంబంధించిన సందేశాలలోని డేటా మొత్తం Google క్లౌడ్ లో సేవ్ చేయబడుతుంది. కాబట్టి, ఇంటర్నెట్ లేకుండా మీ Gmail ఖాతాను యాక్సెస్ చేయలేరనే విషయం అందరికి తెలిసిందే. 

కానీ, కొన్ని అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. ఇంటర్నెట్ సదుపాయం లేకున్నా Gmail ద్వారా సందేశాలను పంపడం సహా పొందేందుకు Google సంస్థ అనేక మార్గాలను వినియోగదారులకు అందిస్తుంది. అయితే ఇంటర్నెట్ లేకుండానే మీ Gmail ఎలా యాక్సెస్ చేయాలో కింద చెప్పిన ప్రక్రియను అనుసరించండి.  

ఇంటర్నెట్ లేకుండా Gmail ఖాతాను వినియోగించడం ఎలా?

1. Google Chrome బ్రౌజర్‌ లో మీ Gmail ఖాతాను లాగిన్ చేయండి.

2. ఓపెన్ అయిన విండో కుడివైపున పై భాగంలో సెట్టింగ్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 

3. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో ఆల్ సెట్టింగ్స్ (all settings) ఆప్షన్ పై క్లిక్ చేయండి. 

4. ఆ తర్వాత ఓ పాప్ అప్ వస్తుంది. అందులో ఆఫ్ లైన్ పై క్లిక్ చేయాలి. 

5. ఆ వెంటనే ఆఫ్ లైన్ మెయిల్ వినియోగాన్ని ప్రారంభించేందుకు చెక్ బాక్స్ లో క్లిక్ చేయాలి. 

6. ఆఫ్ లైన్ లో సందేశాల కోసం మీ టైమ్ లైన్ ను ఎంచుకోండి. అందులో మీకు కావాల్సిన సందేశాలను ఎప్పుడెప్పుడు సెండ్ చేయాలో ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉంది. 

7. తర్వాత మార్చిన సెట్టింగ్స్ ను సేవ్ చేయండి. 

ఈ ప్రక్రియ తర్వాత మీరు Google Chrome బ్రౌజర్‌ ను ఓపెన్ చేసి mail.google.comకి లాగిన్ అవ్వాలి. అలా చేసిన తర్వాత ఆఫ్ లైన్ ద్వారా కూడా మీ ఇన్ బాక్స్ లో మెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మీ మెయిల్స్ ఆర్కైవ్ ను కూడా డౌన్ లోడ్ చేసుకునే మార్గం ఉంది. అయితే మీ మెయిల్స్ ను ఎలా డౌన్ లోడ్ చేయాలో తెలుసుకునేందుకు ఈ ప్రక్రియను ఫాలో అవ్వండి. 

1. ఏదైనా బ్రౌజర్ లో myaccount.google.comని తెరిచి.. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయాలి. 

2. మీ డేటాను బ్యాకప్ చేసే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 

3. డేటా డౌన్ లోడ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అలా మీ జీ మెయిల్ కు సంబంధించిన డేటాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  

Also Read: PAN-Aadhaar: గడువు ముగుస్తోంది పాన్​-ఆధార్​ లింక్​ చేశారా? ఇప్పుడే చెక్​ చేసుకోండి..

Also Read: Edible Oil Price: వంట నూనెల ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News