Rajiv Swagruha flats Allotment: పోచారంలోని తెలంగాణ రాజీవ్ స్వగృహ నివాస సముదాయంలోని ఇళ్లను ఇవాళ లబ్ధిదారులకు కేటాయించారు. పోచారంలో నిర్మించిన రాజీవ్ స్వగృహలోని ఇళ్లలో 1413 ఫ్లాట్స్ కోసం 5921 దరఖాస్తులు రాగా తొలి ప్రాధాన్యత కింద లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులు జరిపారు.  ఇళ్ల కేటాయింపులలో ఎలాంటి అవినీతికి, ఆరోపణలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ఫేస్ బుక్, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ లక్కీ డ్రా తీశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్కీ డ్రా కోసం ఆధార్ కార్డు నెంబర్‌ని ప్రాతిపదికగా తీసుకున్నారు. తద్వారా ఎలాంటి మోసాలకు తావులేకుండా ఒక్క ఆధార్ కార్డుకి ఒక్క ఫ్లాట్ మాత్రమే కేటాయింటేలా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 5 మరియు 6వ అంతస్తుల్లోని 2 పడక గదుల ఇళ్ల కేటగిరిలో 51 నివాసాలు మిగిలి ఉండగా.. వీటిని రెండో ప్రాధాన్యత కింద ఇదే పద్ధతిలో దరఖాస్తుదారులకు కేటాయించనున్నారు. 


ఇదిలావుంటే, రేపు బండ్లగూడలోని రాజీవ్ స్వగృహలో 1719 ఫ్లాట్లకుగాను అందిన 16482 దరఖాస్తుదారులకు లక్కీ లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు (౩ బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డ్రాయింగ్ రూమ్స్ తరహా నివాసాలు కాకుండా మిగతావి) కేటాయించనున్నారు. ఫ్లాట్ల కేటాయింపుల్లో ఎలాంటి అవినితీకి చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా అలాట్‌మెంట్స్ చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మొత్తం ప్రక్రియను ఇవాళ్టి తరహాలోనే ఫేస్ బుక్ (Facebook), యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.


Also read : Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌..రేపే అన్నదాతల ఖాతాల్లోకి సాయం..!


Also read : KBC Lottery Scam : కేబీసీ లాటరీలో రూ.25 లక్షలు గెలుచుకున్నట్టు మెస్సేజ్ వచ్చిందా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.