Facebook Tricks: మీకు ఫేస్బుక్ ఎక్కౌంట్ ఉంటే ఈ ట్రిక్ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ ట్రిక్ సహాయంతో మీరు మీ ప్రొఫైల్ ఎవరెవరు చూశారో చెక్ చేయవచ్చు. ఎలాగంటే..
సోషల్ మీడియా ఎక్కౌంట్ ఫేస్బుక్ కావచ్చు, ఇన్‌స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు లేనివాళ్లు ఉండరు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవల్సింది ఫేస్బుక్ గురించి. ఫేస్బుక్లో మీరు మీకు తెలిసినవాళ్లతోనే లింక్ అవుతారు. కానీ తెలియనివాళ్లు చాలామంది ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంటారు. మీరు వారి రిక్వెస్ట్ అంగీకరించకపోయినా మీ ప్రొఫైల్ మాత్రం వాళ్లు చూడగలరు. ఇప్పుడు మీకు చెప్పబోయే ట్రిక్ ద్వారా మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఎవరెవరు చెక్ చేశారో సులభంగా తెలుసుకోవచ్చు.
మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఎవరు చెక్ చేశారో తెలుసుకునేందుకు మీరు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ వాడాల్సి ఉంటుంది. మొబైల్‌పై ఈ ట్రిక్ పనిచేయదు. ముందుగా మీ ల్యాప్‌ట్యాప్ లేదా డెస్క్టాప్పై ఫేస్బుక్ ఎక్కౌంట్ ఓపెన్ చేయండి ఎక్కౌంట్ ఓపెన్ చేసిన తరువాత మీ ప్రొఫైల్‌కు వెళ్లి..రైట్ క్లిక్ చేయాలి. అక్కడ మీకు చాలా ఆప్షన్స్ కన్పిస్తాయి. అందులోంచి వ్యూ పేజ్ సోర్స్ ఆప్షన్ ఎంచుకోండి. ఇందులో వెళ్లేందుకు కంట్రోల్ యు కమాండ్ కూడా వినియోగించవచ్చు. ఆ తరవాత కంట్రోల్ ఎఫ్ కమాండ్, ఆ తరువాత బడ్డీ అండర్ స్కోర్ ఐడీ సెర్చ్ చేయాలి.
ఇప్పుడు మీకు 15 అంకెలు కన్పిస్తాయి. అవి కాపీ చేసి..https://www.facebook.com/15 లో పేస్ట్ చేయాలి. ఆ తరువాత సెర్చ్ చేస్తే..మీ ప్రొఫైల్ ఎవరెవరు చూశారో తెలుసుకోవచ్చు.
Also read: UPI linking with Credit Card: త్వరలో క్రెడిట్ కార్డుతో యూపీఐ అనుసంధానం, కలిగే ప్రయోజనాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook