హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ (BJP)కి రాజీనామా చేసిన సీనియర్ నేత, తెలంగాణ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి సోమవారం (నవంబర్ 2న) టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డికి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Ravula Sridhar Reddy: బీజేపీకి సీనియర్ నేత రాజీనామా.. అసంతృప్తితో కీలక నిర్ణయం


 


శ్రీధర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు వందలాది మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, బీజేపీకి తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీధర్‌ రెడ్డి ఆదివారం తన రాజీనామాతో షాకిచ్చారు. బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రావుల శ్రీధర్‌రెడ్డి ఆదివారం ఉదయం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి పంపించారు. 



 


జూబ్లీహిల్స్‌ స్థానం నుంచి శ్రీధర్‌రెడ్డి 2018లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు తెలుపుతూ, కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించారు. ఈ మేరకు కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని వీడారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని, చట్టాలు సైతం రూపొందించి రైతన్నలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe