TS ICET 2020 Results: నేడు టీఎస్ ఐసెట్ 2020 ఫలితాలు విడుదల

TS ICET Result 2020 | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఐసెట్‌ -2020 ఫలితాలు (TS ICET 2020 Results) నేడు విడుదల కానున్నాయి. ఫైనల్ కీ, తెలంగాణ ఐసెట్ 2020 ఫలితాలు మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వినర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి వెల్లడించారు.

Last Updated : Nov 2, 2020, 04:02 PM IST
TS ICET 2020 Results: నేడు టీఎస్ ఐసెట్ 2020 ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఐసెట్‌ -2020 ఫలితాలు (TS ICET 2020 Results) నేడు విడుదల కానున్నాయి. ఫైనల్ కీ, తెలంగాణ ఐసెట్ 2020 ఫలితాలు (TS ICET Result 2020) మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వినర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి వెల్లడించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని కామర్స్ ప్రాంగణంలో ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధం చేశారు.

 

సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీలలో నిర్వహించిన టీఎస్ ఐసెట్ - 2020 పరీక్షా ఫలితాలు (TS ICET Exam 2020 Results) తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి  విడుదల చేయనున్నారు. టీఎస్ ఐసెట్ - 2020కు 58,452 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, పరీక్షలకు మొత్తం 45,975 మంది విద్యార్థులు హాజరయ్యారు.

టీఎస్ ఐసెట్ 2020 ఫలితాలు కోసం అధికారిక వెబ్‌సైట్

 

తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ, తెలంగాణ విద్యార్థులు దరఖాస్తులు చేసుకుని పరీక్షకు హాజరయ్యారు. మొత్తం రెండు రాష్ట్రాలలో 70 కేంద్రాలలో టీఎస్ ఐసెట్ నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు.. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News