Telangana: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం యథావిధిగా పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు తిరిగి చెల్లించాలని (Reimburse Deferred Salary To Employees and Pensioners) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కారణంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అటు కేంద్రంలోనూ, ఇటు తెలంగాణ (Telangana)లోనూ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్సనర్ల చెల్లింపులలో కోత విధించడం తెలిసిందే. అయితే ప్రస్తుతం యథావిధిగా పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు తిరిగి చెల్లించాలని (Reimburse Deferred Salary To Employees and Pensioners) తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల జీతాల నుంచే బకాయిలు దశల వారీగా చెల్లించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పింఛన్‌దారులు (Pensioners)కు అక్టోబర్, నవంబర్ నెలలో రెండు విడుదలగా బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో 4 విడుతలుగా బకాయిలు తిరిగి చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. కరోనా సంక్షోభం కారణంగా ప్రైవేట్ రంగాలతో పాటు ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో పింఛన్లు, ఉద్యోగుల జీతాలలో కొంతమేర కోత విధించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.
ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజా ప్రతినిధుల వేతనాలలో 75 శాతం మేర నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐపీఎస్ లాంటి ఆలిండియా సర్వీసు ఉద్యోగుల వేతనాలలో 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం, ఔట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలలో 10శాతం తాత్కాలికంగా కోత విధించడం తెలిసిందే. రిటైర్డ్ ఉద్యోగలు ఫించన్లలో 50 శాతం కోత, నాలుగో తరగతి ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం నిలుపుదల చేశారు. సెప్టెంబర్ వరకు ఉన్న ఈ బకాయిలను అక్టోబర్ నెల నుంచి చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆసక్తికర కథనాలు
Sanju Samson: సిక్సర్ల సీక్రెట్ వెల్లడించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్
ICMR Vaccine Website: ఐసీఎంఆర్ కరోనా వ్యాక్సిన్ వెబ్సైట్ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe