Disha Patani Instagram followers: దిశా పటానీ.. సోషల్ మీడియా రారాణి

ఏ విమర్శలు వచ్చినా, ఏ వదంతులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చ్చింది చేసుకుంటూ దూసుకెళ్తోంది దిశా పటానీ (Disha Patani). అదే నైజం ఆమెకు 40 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ (Disha Patani Instagram followers)ను అందించింది.

Last Updated : Oct 1, 2020, 09:55 AM IST
  • బాలీవుడ్ హీరోయిన్లలో హాట్ బ్యూటీ దిశా పటానీ స్టైలే వేరు. ఏ వదంతులు వచ్చినా వాటిని పట్టించుకోదు
  • దిశా పటానీ నైజం ఆమెకు 40 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ ను అందించింది
  • ఈ ఫాలోయర్లు సొంతం చేసుకునేందుకు కత్రినాకు 15 ఏళ్లు పట్టగా, అనుష్క శర్మకు 12 ఏళ్లు, అలియా భట్‌కు 7 ఏళ్లు పట్టింది.
Disha Patani Instagram followers: దిశా పటానీ.. సోషల్ మీడియా రారాణి

బాలీవుడ్ హీరోయిన్లలో హాట్ బ్యూటీ దిశా పటానీ స్టైలే వేరు. ఏ విమర్శలు వచ్చినా, ఏ వదంతులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చ్చింది చేసుకుంటూ దూసుకెళ్తోంది దిశా పటానీ (Disha Patani). అదే నైజం ఆమెకు 40 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ (Disha Patani Instagram followers)ను అందించింది. తరచుగా తన హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకుంటూ ఫాలోయర్లకు ఎప్పుడూ లేటెస్ట్ విషయాలు అందజేస్తుంది మలాంగ్ బ్యూటీ. 

అతి తక్కువ కాలంలోనే 40 మిలియన్ల ఫాలోయర్లను అందుకున్న రికార్డును తన ఖాతాలో వేసుకుంది దిశా పటానీ. స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, అనుష్క శర్మ, అలియా భట్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలకు సైతం ఇంత తక్కువ కాలంలో 40 మిలియన్ల మార్కు రాలేదు. దిశా పటానీ .. ఎంఎస్ ధోనీ బయోపిక్ మూవీతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. 2016లో ఈ మూవీ విడుదలైంది. అయితే ఆమె కంటే ముందుగానే ఇండస్ట్రీకి పరిచయమైన స్టార్ హీరోయిన్లు కొందరికి ఇంకా దిశా పటానీ చేరుకున్న మార్కు ఫాలోయర్లు లేరంటే నమ్మశక్యం కాదు. ఈ ఫాలోయర్లు సొంతం చేసుకునేందుకు కత్రినాకు 15 ఏళ్లు పట్టగా, అనుష్క శర్మకు 12 ఏళ్లు, అలియా భట్‌కు 7 ఏళ్లు పట్టింది. 

కాగా, బాలీవుడ్‌లో అత్యధిక ఫాలోయర్లు (57.6 మిలియన్లు) ప్రియాంక చోప్రాకు ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో శ్రద్ధా కపూర్ (55.9 మిలియన్లు), దీపికా పదుకొనే (52.4 మిలియన్లు)లకు 50 మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లు ఉన్నారు. టాప్ 4 ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లతో అలియా భట్ (49.8 మిలియన్లు) ఉంది. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే భారీగా ఫాలోయర్లు సొంతం చేసుకున్న వచ్చే ఏడాది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లలో బాలీవుడ్ హీరోయిన్లలో టాప్ 3లో చోటు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

మరిన్ని కథనాలు మీకోసం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News