Revanth Reddy Brothers: ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రేవంత్‌ రెడ్డి సోదరుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పాలనా వ్యవహారాల్లో కల్పించుకోవడంతోపాటు అనధికారికంగా పెత్తనం చేస్తూ దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. రేవంత్‌ రెడ్డి సోదరులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడడం రాజకీయ దుమారం రేపింది. ఆ సంఘటన ముఖ్యమంత్రి స్వగ్రామంలో చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. సీఎం సోదరులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ మాజీ సర్పంచ్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇది చదవండి: Temple Theft: తెలంగాణ ఆలయాల్లో వరుస చోరీలు.. 'దేవుడా నీకు నీవే రక్ష'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లె గ్రామం రేవంత్‌ రెడ్డి సొంతూరు. ఈ గ్రామానికి పాంకుంట్ల సాయిరెడ్డి కొన్నేళ్ల కిందట సర్పంచ్‌గా పని చేశారు. ఆయన 40 సంవత్సరాల కిందట గ్రామంలో ఇల్లు నిర్మించుకున్నారు. అడ్డుగా ఉన్న పాడుబడిన బావిని సొంత ఖర్చులతో పూడ్చి తన ఇంటికి రాకపోకలు సాగించేందుకు మార్గం ఏర్పాటుచేసుకున్నారు. అయితే ఇటీవల రేవంత్‌ రెడ్డి సోదరులు కక్ష కట్టి తన ఇంటికి వెళ్లే మార్గానికి మధ్యలో అడ్డుగోడ కడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పశువుల దవాఖానాకు గోడ నిర్మించి తన ఇంటికి రాకపోకలు సాగించే దారి మూసి వేస్తున్నారని సాయిరెడ్డి తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
ఇది చదవండి: KTR Adani: గౌతమ్ అదానీతో రేవంత్‌ రెడ్డి దోస్తానాను రాహుల్‌ గాంధీ సమర్ధిస్తున్నాడా?


తన ఇంటికి దారి వదలమని బతిమిలాడితే ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వడం లేదని సాయిరెడ్డి వాపోయారు. దీనిపై కక్ష వేరే రాజకీయ పార్టీల కార్యకర్తగా చెప్పి వేధిస్తున్నారని మరణానికి ముందు సాయిరెడ్డి తన వాంగ్మూలంలో వివరించారు. తాను ఏ పార్టీని కాదని.. ప్రస్తుతం దేవుడి పార్టీ అని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తదని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా బాధతో చనిపోతున్నా అని చెప్పి సాయిరెడ్డి తన వాంగ్మూలంలో చెప్పి మృతి చెందాడు.


అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని వనపర్తికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా సాయిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన రేవంత్‌ రెడ్డి సోదరులపై బాధిత కుటుంబసభ్యులతోపాటు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'సీఎం పేరు చెప్పి రేవంత్‌ రెడ్డి సోదరులు రెచ్చిపోతున్నారని.. కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా అలాగే తయారయ్యారు' అని గ్రామస్తులు వాపోతున్నారు. సాయిరెడ్డి ఆత్మహత్య రేవంత్‌ రెడ్డి చేసిన హత్యగా పేర్కొంటున్నారు. కాగా సాయిరెడ్డి ఆత్మహత్యతో సీఎం స్వగ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి ఆందోళన చెలరేగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter