Hindu Temples: తెలంగాణలో ఆలయాలకు భద్రత లేకుండాపోయింది. దేవాలయాల్లో విధ్వంసంతోపాటు దొంగతనాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సికింద్రాబాద్, శంషాబాద్ ఆలయాల్లో దాడులు జరగ్గా.. ఇక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆలయాల్లో దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఒకే రోజు రెండు ఆలయాల్లో దొంగతనం జరిగింది. ఒక శివాలయంలో శివలింగాన్ని ఎత్తుకెళ్లగా.. ఒక ఎల్లమ్మ ఆలయంలో ఆభరణాలు.. కళ్లు దొంగిలించుకు వెళ్లారు. ఈ రెండు సంఘటనలతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి: KTR Adani: గౌతమ్ అదానీతో రేవంత్ రెడ్డి దోస్తానాను రాహుల్ గాంధీ సమర్ధిస్తున్నాడా?
ఎల్లమ్మ ఆలయం..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘణపూర్ ఫకీర్ టెక్యా తండాలోని ఎల్లమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. శుక్రవారం వచ్చి చూడగా ఆలయంలో చిందరవందరగా వస్తువులు ఉన్నాయి. అమ్మవారి మెడలో ఉండాల్సిన ఆభరణాలు లేవని భక్తులు గుర్తించారు. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహంతో పాటు 5 గ్రాముల బంగారు పుస్తెలు, 5 తులాల వెండి కళ్లు దొంగిలించారని భక్తులు తెలిపారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా కొన్ని గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. సీసీటీవీ కెమెరాల సహాయంతో కీసర ఆర్‌జీకే కాలనీకి చెందిన పెండెం రాజు(39), కొండోజు నర్సింహ చారి(51) దొంగతనం చేసినట్లు గుర్తించి పోచారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇది చదవండి: Konda Surekha: కొండా సురేఖ ఇంట్లో మద్యం పార్టీ.. సంచలనంగా మారిన కుమార్తె లేఖ
శివలింగం చోరీ
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్‌నగర్‌లోని పురాతన శివాలయంలో శివలింగం ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న వినాయకుడి విగ్రహాన్ని తీసేసి ఆరుబయట పొదల్లో పడేశారు. ఉదయాన్నే గుడికి వచ్చిన పూజారి శివలింగం, వినాయకుడి విగ్రహం కనిపించకపోవడంతో ఆలయ ఆవరణలో వెతికాడు. వినాయకుడి విగ్రహం లభించగా శివలింగం కనిపించలేదు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు శివాలయం ముందు ఆందోళనకు దిగాయి. దీనిపై పోలీసులకు ఇంకా ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.
కాగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సికింద్రాబాద్, శంషాబాద్ సంఘటనలతోపాటు చాలా చోట్ల ఆలయాలకు రక్షణ లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆలయాలకు రక్షణ కల్పించలేక పోలీసులు విఫలమయ్యారని హిందూ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రోజురోజుకు ఆలయాల్లో నేరాలు పెరిగిపోతున్నాయని.. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter