Revanth Comments On Chandrababu: పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన శిష్యుడు రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిరంతరం పని చేస్తారని.. అభివృద్ధి కోసం పని చేస్తారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆయనతో పోటీ పడే అవకాశం తనకు దక్కిందని బాబుపై ప్రసంశలు కురిపించారు. ఇకపై ఆయనలాగా తాను, తన సహచరులు పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వార్షికోత్సవంలో రేవంత్‌ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Coal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త


 


హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బసవతారకం 24వ వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. ఆస్పత్రి మేనేజింగ్‌ ట్రస్టీ, ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బసవతారకం ఆస్పత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని కొనియాడారు. ఈ ఆస్పత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని.. ఈ ఆస్పత్రికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని ప్రకటించారు. నిస్వార్థంగా పేదలకు సేవలు అందిస్తున్న ఆస్పత్రికి సంబంధించిన అనుమతులను వెంటనే మంత్రివర్గంలో చర్చించి పరిష్కరించినట్లు గుర్తుచేశారు.

Also Read: KarimNagar: అచ్చం మోదీలా బండి సంజయ్.. తొలిసారిగా కేంద్ర మంత్రి ఏం చేశారో చూశారా?


 


ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడిన ఈ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషమని రేవంత్‌ రెడ్డి కొనియాడారు. 'ఎన్టీఆర్ ఆలోచన విధానాలను కొనసాగించాలని చంద్రబాబు నాయుడు ఆసుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అందించేలా చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో చంద్రబాబుతో పోటీ పడి పని చేసే అవకాశం నాకు వచ్చింది. అభివృద్ధి, సంక్షేమంలో ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలవాలి' అని తెలిపారు.


గురువుపై ప్రశంసలు
ఏపీ సీఎం చంద్రబాబుపై ఈ సందర్భంగా రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఈ వేదికపై నుంచి ఒక ప్రకటన చేస్తున్నా. ఆట నైపుణ్యం వెలికిరావాలి.. ప్రజల గుర్తింపు రావాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీపడాలని పెద్దలు చెబుతుంటారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడితో అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పని చేస్తుంటే సరిపోతే అనుకునేవాడిని. కానీ ఇప్పుడు చంద్రబాబు 18 గంటలు పని చేస్తే మేం 12 గంటలు పని చేస్తే కుదరదు. ఇప్పుడు మేం, మా సహచరులు 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడి తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నా' అని తెలిపారు. 


'తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అన్ని రకాల వైద్య సేవలు అందేలా హెల్త్ టూరిజం హబ్ ఉంటుంది. దీనిలో బసవతారకం ఆసుపత్రికి చోటు కచ్చితంగా ఉంటుంది. వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా  హైదరాబాద్‌కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా తీర్చిదిద్దుతాం' అని రేవంత్‌ రెడ్డి చెప్పారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter