KarimNagar: అచ్చం మోదీలా బండి సంజయ్.. తొలిసారిగా కేంద్ర మంత్రి ఏం చేశారో చూశారా?

Bandi Sanjay Kumar Bows And Touched The Ground Of Karimnagar: కేంద్ర మంత్రిగా తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన బండి సంజయ్‌ ప్రత్యేకత చాటారు. తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్‌ గడ్డకు సాష్టాంగ నమస్కారం చేసి మోదీని గుర్తు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 19, 2024, 04:27 PM IST
KarimNagar: అచ్చం మోదీలా బండి సంజయ్.. తొలిసారిగా కేంద్ర మంత్రి ఏం చేశారో చూశారా?

Bandi Sanjay Kumar: కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన బండి సంజయ్‌ కుమార్‌ ఇటీవల కేంద్ర మంత్రిగా ఎన్నికైన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిసారి తన సొంత నియోజకవర్గం కరీంనగర్‌కు వచ్చారు. తొలిసారి సందర్శించిన సమయంలో బండి సంజయ్‌ అచ్చం ప్రధానమంత్రి నరేంద్ర మోదీలాగా వ్యవహరించారు. కరీంనగర్‌ పట్టణంలో నేలపై పడుకుని కరీంనగర్‌ నేలకు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రధానమంత్రిగా 2014లో ఎన్నికైన నరేంద్ర మోదీ పార్లమెంట్‌ భవనం ముందు నమస్కారం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు.

Also Read: Medak Incident: రాత్రికి రాత్రి మెదక్‌లో ఏం జరిగింది? ఉద్రిక్తత పరిస్థితులకు కారణాలు ఏమిటి

లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్‌ కుమార్ ఈనెల 8వ తేదీన ఢిల్లీలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం తొలిసారి కేంద్ర మంత్రిగా సంజయ్‌ తెలంగాణకు చేరుకున్నారు. తన సొంత నియోజకవర్గం కరీంనగర్‌లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు.

Also Read: Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..

కరీంనగర్‌ పట్టణంలో అడుగుపెట్టిన అనంతరం బండి సంజయ్ కరీంనగర్ గడ్డకు ప్రణమిల్లి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'సెల్యూట్ తెలంగాణ..సెల్యూట్ కరీంనగర్' అని తెలిపారు. తనను గెలిపించిన కరీంనగర్‌ ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కరీంనగర్‌ అభివృద్ధికి శ్రమించి పని చేస్తానని ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులను కాపాడుకుంటానని చెప్పారు. అందరినీ కలుపుకుని కరీంనగర్‌ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News