Sangareddy Jailer Suspend: తెలంగాణ పోలీసులు దారుణాలకు వ్యవహరిస్తున్నారు. లగచర్ల రైతుకు బేడీలతో ఆస్పత్రికి తరలించడంతో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఘటనకు కారణంగా ఓ చూపుతూ ఓ అధికారిని సస్పెండ్‌ చేశారు. ఇక ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పోలీస్‌ ఉన్నత అధికారులు స్వయంగా విచారణ చేపడుతున్నారు. అయితే ఈ సంఘటన కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ ప్రతిష్టాత్మకంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Lagacharla Farmer: తెలంగాణ పోలీసులు మరో దారుణం.. బేడీలతోనే లగచర్ల రైతు ఆస్పత్రికి తరలింపు


 


ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల రైతులు ఆందోళన చేపట్టగా.. అనుకోని సంఘటనలు చోటుచేసుకోవడంతో రైతులు, గ్రామస్తులను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన రైతులు సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్నారు. జైలుల్లో ఉన్న రైతుల్లో ఈర్యా నాయక్‌కు గురువారం ఉదయం గుండెపోటు రావడంతో జైలు అధికారులు హీర్యా నాయక్‌కు బేడీలు వేసి ఆస్పత్రికి తరలించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్‌ రెడ్డి పోలీస్‌ శాఖకు కఠిన చర్యలకు ఆదేశించారు. అందులో భాగంగా సంగారెడ్డి జైలు అధికారిగా ఉన్న సంజీవ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

Also Read: KT Rama Rao: రైతుకు సంకెళ్లు రేవంత్ రెడ్డి క్రూర మనస్తత్వానికి నిదర్శనం


రంగంలోకి అధికారులు
రైతుకు సంకెళ్లు వేయడంపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న తీవ్ర స్పందన నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో రైతులు, గ్రామస్తులతో అధికారుల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చాయి. అనంతరం జైలర్‌ను తొలగించిన అనంతరం ఐజీ సత్యనారాయణ రంగంలోకి దిగారు. నాలుగు గంటలపాటు వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని ఐజీ విచారణ చేశారు. హీర్య నాయక్‌కు బేడీలు వేసిన వ్యవహారంలో సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవరెడ్డిని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సస్పెండ్‌ చేశారు. ఆమె ఆదేశాల మేరకు ఊజీ సత్యనారాయణ విచారణ చేపట్టారు.


కుట్రకోణం
విచారణ కోసం వచ్చిన ఐజీ సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా కేసులో కూడా కుట్రకోణం ఉందని తెల్లడించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ పోలీసులకు జైలు అధికారులకు ఫోన్‌ చేసి విచారించారు. జైలు రికార్డులో ఈర్యా నాయక్ లగచర్ల కేసులో  నిందితుడిగా కాకుండా బాలానగర్‌లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నట్టు జైలు సిబ్బంది పేర్కొన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.