Anganwadi Centers: బాలింతలు.. గర్భిణీలు.. చిన్నారులకు నాణ్యమైన ఆహారం.. సౌకర్యాలు అందిస్తామని మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధన‌స‌రి అన‌సూయ సీత‌క్క తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోని అంగ‌న్‌వాడీ కేంద్రాల‌ను స‌కాలంలో అన్ని అందిస్తామని ప్రకటించారు. పోష‌కాహ‌ర తెలంగాణ ల‌క్ష్యంగా చేస్తామని స్పష్టం చేశారు. రైతుల ప్ర‌యోజ‌నాలను కాపాడడంతో పాటు త‌మ‌కు గ‌ర్భిణీలు, బాలింత‌లు, చిన్నారుల సంరక్ష‌ణ అంతే ప్రాముఖ్యం అని స్పష్టం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్‌ ప్రజలకు తెలుసు'


హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో శనివారం సీతక్క ఆరోగ్య ల‌క్ష్మీ ప‌థ‌కంపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో‌ పాల సరఫరాపై మ‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్, డైరెక్ట‌ర్ కాంతి వెస్లీ‌తో సమీక్షించారు. గ‌ర్భిణీలు, బాలింత‌ల‌కు పోష‌కాహరం అందించే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ఆరోగ్య ల‌క్ష్మీ ప‌థ‌కాన్ని అమలు చేస్తోందని వివరించారు. రోజూ 200 ఎంఎల్  పాల‌ను గ‌ర్భిణీలు, బాలింత‌ల‌కు అంగ‌న్ వాడీ కేంద్రాల ద్వారా పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: KTR Break: 'నేను రెస్ట్‌ తీసుకుంటా.. ఇక చెల్లి, బావ మీరు తగులుకోరి': కేటీఆర్‌


విజ‌య డెయిరీ టెట్రా ప్యాకెట్ల‌ అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు సరిపడా సరఫరా చేయకపోవడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని అంగ‌న్‌వాడీ కేంద్రాలకు స‌కాలంలో పాలు సరఫరా కాకపోవడంపై ఆరా తీశారు. 'కోరినంత మేర పాలు సరఫరా చేస్తారా? లేదా? అంత సామ‌ర్ధ్యం ఉందా? లేదా?' అని విజయ డెయిరీ అధికారులను ప్రశ్నించారు. స‌రిపోయినంత స‌ప్లై చేసే శ‌క్తి లేక‌పోతే.. మీ ఇండెంట్‌ త‌గ్గించి ఇత‌ర సంస్థ‌ల ద్వారా సరఫరా చేసుకోవాలా అని విజ‌య డెయిరీ ప్ర‌తినిధుల‌ను అడిగారు. 


మూడు నెల‌ల పాటు అవ‌కాశం ఇస్తామ‌ని.. పాల స‌ర‌ఫ‌రా సంతృప్తిక‌రంగా లేక‌పోతే ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌స్తుందని  మంత్రి సీతక్క హెచ్చ‌రించారు. రైతుల నుంచి పాల‌ను సేక‌రిస్తున్న కారణంగా పాల‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య తెలంగాణ‌, పోష‌కాహార తెలంగాణ నిర్మాణ‌మే ల‌క్ష్యంగా తాము పని చేస్తున్నట్లు ప్రకటించారు. అంగన్‌వాడి కేంద్రాలకు సరఫరా అయ్యే పాల  నాణ్యతను స్వ‌యంగా రుచి చూశారు. విజ‌య డెయిరీ పాల ధరలు పెంపుపై ప్ర‌తిపాదనలు చేయగా మంత్రి తిర‌స్క‌రించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter