Tenth class Exams: పదోతరగతి పరీక్షల నిర్వహణపై కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆరు పరీక్షలే నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ‘పది’ పరీక్షల(10th Exams) విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఉన్న 11 పేపర్లకు బదులుగా ఈసారి ఆరు పరీక్షలే నిర్వహించాలని, ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష చొప్పున ఉండాలని నిర్ణయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరీక్షా సమయం పెంపు
పదో తరగతి పరీక్షల(Tenth class Exams)కు సమయం అరగంట పెంచాలని అధికారులు నిర్ణయించారు. పదో తరగతి విద్యార్థులకు 3 గంటల 15 నిమిషాల పాటు  ఒక్కో పరీక్ష జరగనుంది. సైన్సు పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయి. పశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. బోర్డు పరీక్షకు 80 మార్కులు, ఎఫ్‌ఏ పరీక్షలకు 20 మార్కులు చొప్పున కేటాయించనున్నట్టు అధికారులు వెల్లడించారు. 


Also read: AP & TS High Courts: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు


సిలబస్‌ తగ్గింపు
పాఠశాల విద్యార్థులకు సిలబస్‌(Syllabus) తగ్గిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1 నుంచి 10 తరగతులకు 70శాతం సిలబస్‌ బోధించాలని నిర్ణయించారు. సిలబస్‌ తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతేడాది ఉత్తర్వులను ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook