Telangana: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతిరోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..సంక్రమణ మాత్రం ఆగడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్(Corona Second wave) ప్రకంపనలు రేపుతోంది. రోజురోజుకూ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా అంటే గత 24 గంటల్లో తెలంగాణలో 7 వేల 432 మందికి కోవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కరోనా వైరస్ (Coronavirus) కారణంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కరోనా వైరస్ నుంచి 2 వేల 152 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంల 58 వేల 148 యాక్టివ్ కేసులున్నాయి.


రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 87 వేల 106కు చేరుకోగా..మరణించినవారి సంఖ్య 1961కు చేరుకుంది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.1 శాతమైతే తెలంగాణ(Telangana)లో 0.51గా ఉంది. ఇక కరోనా నుంచి కోలుకున్నవారు 86 శాతం ఉన్నారు. గత 24 గంటల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1464 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 606 కేసులు, రంగారెడ్డిలో 504, నిజామాబాద్ జిల్లాలో 486 కేసులున్నాయి. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ( Night Curfew) అమలు చేస్తోంది. ఆక్సిజన్ కొరత, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల ( Remdesivir Injections) కొరత, బెడ్స్ కొరతను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. 


Also read: యుద్ధ విమానాల్లో oxygen tankers ఒడిశా నుంచి తెలంగాణకు Oxygen supply


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook