Agnipath Riots: వరంగల్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై రాళ్ల దాడి.. రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత
Agnipath Riots: దేశవ్యాప్తంగా కాక రేపుతున్న అగ్నిపథ్ మంటలు తెలంగాణలోని జిల్లాలకు వ్యాపిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండ కలకలం రేపగా.. తాజాగా వరంగల్ లోనూ ఉద్రిక్తత తలెత్తింది.
Agnipath Riots: దేశవ్యాప్తంగా కాక రేపుతున్న అగ్నిపథ్ మంటలు తెలంగాణలోని జిల్లాలకు వ్యాపిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండ కలకలం రేపగా.. తాజాగా వరంగల్ లోనూ ఉద్రిక్తత తలెత్తింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన రాకేష్ అంతిమయాత్ర సందర్భంగా నిరసనకారులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. వరంగల్ బీఎస్ఎన్ ఎల్ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. కార్యాలయం ముందు ఉన్న ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.
వరంగల్ ఎంజీఎం నుంచి రాకేష్ మృతదేహాన్ని అతని సొంతూరు ఖానాపూర్ మండలం దబీల్ పేటకు ర్యాలీగా తరలించారు. రాకేష్ అంతిమయాత్రలో స్థానికులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సహా వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు కూడా అంతియర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రాకేష్ పాడే మోశారు. నర్సంపేటలో భారీ ర్యాలీ తీయనున్నారు. రాకేష్ మృతికి నిరసనగా ఇవాళ నర్సంపేటలో టీఆర్ఎస్ బంద్ నిర్వహిస్తోంది. మోడీ సర్కార్ దుర్మార్గపు విధానాల వల్లే రాకేష్ చనిపోయారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
Read also: Virata Parvam 1st Day Collections: సాయి పల్లవి-రానా 'విరాటపర్వం' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా...
Read also: Jr NTR Craze in Israel: పత్రికల్లో ఎన్టీఆర్ మీద కథనాలు.. పాన్ ఇండియా కాదిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook