Virata Parvam 1st Day Collections: సాయి పల్లవి-రానా 'విరాటపర్వం' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా...

Virata Parvam 1st Day Box Office Collections: హిట్ టాక్ తెచ్చుకున్న విరాటపర్వం సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2022, 11:52 AM IST
  • హిట్ టాక్ సొంతం చేసుకున్న విరాటపర్వం
  • తొలిరోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్
  • మౌత్ పబ్లిసిటీతో కలెక్షన్లు పెరిగే ఛాన్స్
Virata Parvam 1st Day Collections: సాయి పల్లవి-రానా 'విరాటపర్వం' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా...

Virata Parvam 1st Day Box Office Collections: విప్లవోద్యమం నేపథ్యంలో తెరకెక్కిన 'విరాటపర్వం' సినిమా శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద తొలిరోజు దాదాపు రూ.4 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.5 కోట్లు, ఓవర్‌సీస్‌లో 60K డాలర్లు వసూళ్లు సాధించింది. అయితే వసూళ్లపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

విరాటపర్వం ప్రదర్శించబడుతున్న థియేటర్లలో తొలిరోజు 50 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైనట్లు చెబుతున్నారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో మౌత్ పబ్లిసిటీ హెల్ప్ అవుతుందని భావిస్తుందన్నారు. అదే జరిగితే వసూళ్లు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. 

విరాటపర్వం సినిమా బడ్జెట్ రూ.15 కోట్లు. దాదాపు రూ.14 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ.4 కోట్లు, సీడెడ్‌లో రూ.2 కోట్లు, ఆంధ్రాలో రూ.5 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.1 కోటి, ఓవర్‌సీస్‌లో రూ.2 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో వచ్చాయి. చాలా చోట్ల సినిమాను సొంతంగానే రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1110 స్క్రీన్లలో సినిమా ప్రదర్శితమవుతోంది.

ఈ సినిమాలో సాయి పల్లవి, రానాల నటన అద్భుతమని చెప్పొచ్చు. దర్శకుడు వేణు ఊడుగుల ఎమోషనల్ లవ్ స్టోరీని ఎంగేజింగ్‌గా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాలో వేణు ఊడుగుల డైలాగ్స్, బీజీఎం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ ఈ సినిమాను నిర్మించారు.

Read also: Agnipath Riots: కేసీఆర్ రాజకీయ అస్త్రంగా అగ్నిపథ్.. రాకేష్ డెడ్ బాడీతో భారీ ర్యాలీకి టీఆర్ఎస్ ప్లాన్?    

Read also: Secunderabad Agnipath Violence: 'పెట్రోల్, టైర్లు, పాత దుస్తులు తీసుకురా'.. సికింద్రాబాద్ 'అగ్నిపథ్' అల్లర్లకు వాట్సాప్‌ ద్వారా ఇలా కుట్ర.. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x