Hyderabad: వనస్థలిపురంలో కలకలం రేపిన మొండెం లేని శిశువు తల.. నోటకరిచి తీసుకొచ్చిన కుక్క..
Stray dog carries Infant baby`s head: హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో మొండెం లేని శిశువు తల తీవ్ర కలకలం రేపింది. ఓ వీధి కుక్క శిశువు తలను నోటకరిచి తీసుకొచ్చింది.
Stray dog carries Infant baby's head: హైదరాబాద్ శివారులోని వనస్థలిపురంలో మొండెం లేని శిశువు తల తీవ్ర కలకలం రేపింది. ఓ వీధి కుక్క శిశువు తలను నోటకరిచి తీసుకొచ్చింది. అది గమనించిన ఓ వ్యక్తి కుక్కను తరమడంతో.. శిశువు తలను వదిలి కుక్క అక్కడి నుంచి పారిపోయింది. వనస్థలిపురం పరిధిలోని సహారా గేట్ 1 సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
[[{"fid":"224497","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఘటనపై స్థానిక పాల బూత్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుక్కను తానే తరిమినట్లు చెప్పాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు శిశువు తలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. శిశువు తలను కుక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మేకల్‌సోంపల్లె గ్రామ శివారులో తల లేని ఓ శిశువు మృతదేహం కలకలం రేపింది. స్థానికులే శిశువు మృతదేహాన్ని శ్మశానంలో పూడ్చి పెట్టారు. ఇటీవలి కాలంలో గ్రామంలో ఎవరికీ ప్రసవం కాలేదని స్థానిక వైద్య సిబ్బంది తెలిపారు. దీంతో వేరే గ్రామానికి చెందినవారెవరైనా శిశువు మృతదేహాన్ని అక్కడ పడేశారా.. లేక కుక్కలు తీసుకొచ్చి అక్కడ పడేశాయా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
Also Read: PIL against New Districts: జగన్ సర్కార్‌కు మరో షాక్.. కొత్త జిల్లాలపై హైకోర్టులో పిల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook