Teen Girl Commits Suicide Over Smart Phone Issue In Mancherial: కొందరు యువత సమాజంలో స్మార్ట్ ఫోన్ లకు అడిక్ట్ అవుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్ లోనే గడుపుతున్నారు. ఒక నిముషం కూడా తమ ఫోన్ లను విడిచి ఉండట్లేదు. అంతేకాకుండా కొందరు ఫోన్ కు అలవాటు పడిపోయి, రాత్రిళ్లు కూడా నిద్రను దూరం చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. ఇంట్లో వాళ్లు ఫోన్ విషయంలో ఏదైన చెబితే,గొడవలు పడి నానా రచ్చ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Dog Poops On Desk: బిగ్ షాక్ లో యాంకర్.. లైవ్ లోనే ఆ పని చేసేసిన కుక్క పిల్ల.. వైరల్ గా మారిన ఘటన..


సెల్ ఫోన్ విషయంలో ఏదైన జరిగితే.. విలవిల్లాడిపోతున్నారు. స్కూల్ డేస్ లోనే సెల్ ఫోన్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్ లు కొనియ్యకుండే ఇంట్లో వాళ్లతో గొడవలకు దిగుతున్నారు. అంతేకాకుండా.. ఫోన్ కొనివ్వకుంటే,చనిపోతామంటూ కూడా ఇంట్లో వాళ్లను వేధిస్తున్నారు. సెల్ ఫోన్ కోసం ప్రాణాలు వదిలిన సంఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 


పూర్తి వివరాలు.. 


తెలంగాణలో మంచిర్యాలలో దారుణ ఘటన జరిగింది.  జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అయితే కూతురు సాయిషుమా(19) ఫోన్ పగిలిపోయింది. దీంతో తల్లిదండ్రులు తరచుగా ఫోన్ లో ఎక్కువగా ఉంటుందని, ఫోన్ ను కావాలని పాడుచేస్తున్నావంటూ కూడా మందలించారు. అంతేకాకుండా.. సెల్ ఫోన్ కావాలంటే మరికొన్నిరోజులు వేచిచూడాలంటూ కూడా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సెల్ ఫోన్  బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగింది, దీంతో తరచూ సెల్ఫోన్ పాడు చేస్తున్నావని తల్లి మందలించి, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పింది. తన అన్న ఏది..  అడిగిన అది చేయిస్తారు కానీ తాను అడిగితే మాత్రం ఏమీ చెయ్యరు అంటూ సాయిషుమా మనస్తాపంతో ఇంట్లో వాళ్లతో గొడవకు దిగింది.


Read More: Venu Swami Astrologer: వేణుస్వామి చనిపోవడంపై థంబ్ నెయిల్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సెలబ్రిటీ ఆస్ట్రాలజర్..


అంతేకాకుండా.. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం టైంలో సుమ తమ్ముడు ఇంటికి వచ్చి ఎంత సేపు డోర్‌ కొట్టినా తీయకపోవడంతో  కిటికీ లోంచి చూడగా సుమ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి చూసే సరికే సుమ చనిపోయింది. దీంతో ఇంట్లో వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు చెప్పారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter