Teenmar Mallanna: తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం తీన్మార్‌మల్లన్న. ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా కేవలం సోషల్‌మీడియానే ఆయుధంగా చేసుకొని జనానికి దగ్గరయ్యారు మల్లన్న. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగారు. గత ఏడాదికంటే ముందు ఓ సారి ఎమ్మెల్సీగా, అనంతరం హుజూర్‌నగర్ అసెంబ్లీకి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అయినా బెదరకుండా గత ఏడాది జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మరోసారి పోటీచేశారు. ఎవరిమద్దతూ లేకుండా స్వతంత్రంగా గెలిచినంత పనిచేశారు. జాతీయపార్టీలను వెనక్కి నెట్టి .. అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చి రెండోస్థానంలో నిలిచారు. అప్పటినుంచి తీన్మార్‌ మల్లన్న పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిచెందాక మరింత దూకుడు పెంచారు తీన్మార్‌ మల్లన్న. టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఏకంగా యుద్ధమే ప్రకటించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజూ కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై పదునైన విమర్శలు చేశారు. దీంతో మల్లన్నను టార్గెట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అరెస్ట్ చేసి జైల్లో వేసింది. దాదాపు రెండు నెలల పాటు జైల్లో ఉన్న మల్లన్న అతికష్టంమీద బెయిల్‌పై విడుదలయ్యారు.


జైల్లో ఉన్నప్పుడు బీజేపీ ఆయనకు తోడుగా నిలిచింది. ఎంపీ ధర్మపురి అర్వింద్ .. తీన్మార్ మల్లన్న పట్ల పర్సనల్ కేర్ తీసుకున్నారు. మల్లన్న భార్యను అమిత్‌షా వద్దకు తీసుకెళ్లి పరిస్థితిని వివరించారు. మల్లన్న విడుదల కోసం తనవంతు ప్రయత్నం చేశారు. దీంతో జైలు నుంచి విడుదలైన తర్వాత బీజేపీలో చేరారు తీన్మార్‌ మల్లన్న. కొంతకాలం ఆ పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఏంజరిగిందో కానీ.. మల్లన్న క్రమంగా కమలం పార్టీకి దూరమయ్యారు. కొంత కాలం కింత తన మద్దతుదారులతో జరిగిన కార్యక్రమంలో ఇక బీజేపీ పార్టీ ఆఫీసు గడపతొక్కనని సంచలన శపథం చేశారు. అప్పటినుంచి బీజేపీకి అధికారికంగా రాజీనామా చేయకున్నా... పార్టీ కార్యక్రమాల్లో మాత్రం మల్లన్న పాల్గొనడంలేదు.


ఇక బీజేపీకి దూరమైన మల్లన్న తిరిగి తన పాతపంథాలోనే టీఆర్ఎస్ సర్కార్‌పై సమరభేరీ మోగించారు. ప్రజలతో మమేకమవుతూ సమస్యలపై పోరాటంచేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబపాలనపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. యూత్‌లో బాగా ఫాలోయింగ్ ఉన్న తీన్మార్‌ మల్లన్న ఇప్పుడు మరోపార్టీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల తన ఛానెల్‌ లో పవన్‌ కళ్యాణ్‌ను పొగుడుతూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్నిస్తున్నాయి. తెలంగాణలోనూ తన పార్టీని విస్తరించాలని చూస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌... తీన్మార్‌ మల్లన్న ఫాలోయింగ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడట. అటు తనకు కూడా ఏదోఒక పార్టీ అండ ఉండాలని భావిస్తున్న మల్లన్న కూడా పవన్ ఆఫర్‌పట్ల కాస్త సుముఖంగానే ఉన్నట్లు టాక్. దీనిలో భాగంగానే తన ఛానెల్‌లో ఈ మధ్య పవన్‌ కళ్యాణ్‌ పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారని ఆయన అభిమానులు అంటున్నారు.



 పవన్ ఎప్పటికైనా సీఎం అవుతారన్న మల్లన్న వ్యాఖ్యలు అందులో భాగమేనని చెబుతున్నారు. ప్రతి జనసేన కార్యకర్త పదిఇళ్లలో ప్రచారం చేస్తే పవన్ అధికారంలోకి వస్తారని మల్లన్న ఓ సలహాకూడా ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే మల్లన్న జనసేన కండువా కప్పుకోవడం ఖాయమని సమాచారం. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా... జనసేన మిత్రపక్షమైన బీజేపీ నుంచి ఓ నేతను చేర్చుకుంటే రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగే అవకాశముందని కూడా కొందరు అనుమానపడుతున్నారు.


ఈ ఒక్క అడ్డంకి తొలిగితే త్వరలోనే పవన్‌ పార్టీలోకి మల్లన్న ఎంట్రీ ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు. దీంతో పవన్ పార్టీకి తెలంగాణలో మంచి గ్రౌండ్ కూడా లభిస్తుందని చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలపై పవన్‌ మంచి అవగాహనతోనే ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో తమకు రెండు మూడు వేల ఓట్లైతే ఖచ్చితంగా ఉన్నాయని .. దానికి ఇలా మరొక అండ తోడైతే వచ్చే ఎన్నికల నాటికి పట్టు పెంచుకోవచ్చన్నది పవన్ వ్యూహమట. మరి పవన్ మల్లన్న కలుస్తారో లేదో అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.


Also Read: Horoscope Today July 23rd : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఇవాళ ఎదురే ఉండదు.. అన్నింటా దూసుకుపోతారు..


Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు 


 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.