Horoscope Today July 23rd : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఇవాళ ఎదురే ఉండదు.. అన్నింటా దూసుకుపోతారు..

Horoscope Today July 23rd 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ మేష, మిథున, కర్కాటక రాశుల వారికి శుభ దినం. వృషభ,కన్య,మకర రాశుల వారికి కలిసిరాదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 23, 2022, 06:38 AM IST
  • జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవాళ మేష, మిథున,కర్కాటక తదితర రాశుల వారికి శుభ ఫలితాలు
  • వృషభ, కన్య, మకర తదితర రాశుల వారికి కలిసిరాదు
  • ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతకం ఎలా ఉందో తెలుసుకోండి
Horoscope Today July 23rd : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఇవాళ ఎదురే ఉండదు.. అన్నింటా దూసుకుపోతారు..

Horoscope Today July 23rd 2022: ఇవాళ శనివారం. ఈరోజున శని దేవుడిని పూజిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పితృ దోషంతో బాధపడేవారు శనివారం శనీశ్వరుడిని పూజించడం ద్వారా దోష పరిహారం చేసుకోవచ్చు. మరి ఈ శనివారం ఏయే రాశుల వారిపై జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి (Aries)

ఇవాళ మీపై చంద్ర అనుగ్రహం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. పనిలో చురుగ్గా ఉంటారు, బాగా రాణిస్తారు. వృత్తిపరమైన పనులే కాదు, మీకు ఏ పని అప్పగించినా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పని సామర్థ్యం మీకు మంచి గుర్తింపును తీసుకొస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ బిజినెస్‌పై మరింత ఫోకస్ పెడుతారు. వ్యాపార పురోగతికి కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభ రాశి (Taurus)

ఇవాళంతా నిరాశపూరితంగా ఉంటుంది. లక్ష్యం వైపు నుంచి దృష్టి పక్కకు మళ్లుతుంది. కొన్ని నిర్ణయాలు రియాలిటీకి విరుద్ధంగా ఉంటాయి. అతిగా ఆశించడం వల్ల కొన్ని విషయాల్లో భంగపడుతారు. లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్లవద్దు.  విద్యార్థులు ఏకాగ్రత కోసం ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

మిథున రాశి (GEMINI)

ఏ పనైనా సులువుగా పూర్తిచేస్తారు. పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఒకరకంగా మీకు ఎదురే లేదన్నట్లుగా ఉంటుంది. ఆర్థికపరమైన పురోగతి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఊహించని రీతిలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. పెళ్లయి పిల్లలు లేనివారికి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. దంపతులు ఇరువురు తమ తమ రంగాల్లో బాగా రాణిస్తారు.

కర్కాటక రాశి (Cancer) 

ఈ సమయం మీకు బాగా కలిసొస్తుంది. అది మీకు సంతోషాల్ని తీసుకొస్తుంది. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమీప భవిష్యత్తులో అది మీకు లాభాలను ఇస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రభావశీలురైన వ్యక్తుల పరిచయం మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ప్రపంచాన్ని మీరు చూసే దృక్కోణం మారిపోతుంది.

సింహ రాశి (LEO)

ఇవాళ సంతోషకరంగా సాగుతుంది. మీలో ఓపిక మరింత పెరుగుతుంది. పనులను ఓపికగా పూర్తి చేయడంలో మీకు మీరే సాటి అనే పేరు పొందుతారు. మీ శక్తి సామర్థ్యాలు మెరుగవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా దైవ చింతన పెరుగుతుంది. ప్రేమికులు కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. ప్రేమ జంటలు ప్రత్యర్థుల కదలికలపై ఓ కన్నేసి ఉంచాలి.

కన్య రాశి (Virgo)

ఇవాళ మీకు నిరాశజనకమైన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులేవీ ముందుకు సాగవు. తద్వారా చేతికి వచ్చినట్లే వచ్చిన కొత్త ప్రాజెక్టులు కూడా చేజారిపోతాయి. వృత్తిపరంగా మీపట్ల ఇదివరకు ఉన్న గౌరవం తగ్గుతుంది. మీ నిర్లక్ష్య ధోరణితో మీరే విమర్శలు కొనితెచ్చుకుంటారు. ప్రేమ జంటలకు ఇది ప్రతికూల సమయం. చిన్న చిన్న విషయాలకే గొడవపడి బ్రేకప్ దాకా వెళ్లే అవకాశం ఉంది. 

తులా రాశి (Libra)

ఇవాళ మీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. కొత్త పార్ట్‌నర్‌తో కలిసి కొత్త వ్యాపారం మొదలుపెట్టే అవకాశం ఉంది. వ్యాపార నిమిత్తం సుదూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. జీవిత భాగస్వామి మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఆమె లేదా అతని మనసును అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా మెలగాలి. అప్పుడే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

వృశ్చిక రాశి (Scorpio)

ఆఫీసులో మీకు అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. మీ పనితీరు బాస్‌ని ఆకర్షిస్తుంది. మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. తోబుట్టువులతో వివాదాలు, తగాదాలు సమసిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కోరుకున్న జాబ్ దొరుకుతుంది.

ధనుస్సు రాశి (Sagittarius)  

పిల్లల చదువులకు సంబంధించిన విషయాల్లో బిజీ బిజీగా గడుపుతారు. పిల్లల ఉన్నత విద్యకు ప్లాన్ చేస్తారు. దంపతులు సంతానం విషయంలో శుభవార్త వింటారు. మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకుంటారు. అవివాహితులు పెళ్లి కోసం తొందరపడుతారు. జీవిత భాగస్వామిని వెతికే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. విద్య, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నవారు మరింత బాగా రాణిస్తారు.

మకర రాశి (Capricorn) 

ఇవాళ మీ మనసు అసంతృప్తితో నిండిపోతుంది. వ్యాపారంలో నష్టాలు మిమ్మల్ని కుంగదీస్తాయి. భారీ పెట్టుబడిని నష్టపోతారు. ఇకనైనా పెద్ద ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరమని గుర్తించండి. పెద్దల ఆరోగ్యం కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇంటి పునర్నిర్మాణం చేపట్టే యోచనలో ఉంటారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన విరమించుకుంటే బెటర్.

కుంభ రాశి (Aquarius)

తోబుట్టువులతో సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతా కలిసిపోతారు.మునుపటిలా మళ్లీ బంధాలు వికసిస్తాయి. చేపట్టిన పనులు సులువుగా పూర్తవుతాయి. మీ నెట్‌వర్క్‌ను మరింత పెంచుకుంటారు. ఆపదలో ఉన్నవారు సాయం కోరి వస్తే కాదనుకుండా సాయం చేస్తారు. మీ సోషల్ స్టేటస్ పెరుగుతుంది. కుటుంబం, బంధువుల్లోనూ మీ పట్ల గౌరవం రెట్టింపవుతుంది.

మీన రాశి (Pisces) 

కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. ఫ్యామిలీ లేదా స్నేహితులతో ఉండేందుకే ఎక్కువ ఇష్టపడుతారు. ఆర్థికపరంగా ఎటువంటి లోటు ఉండదు. అయితే ఆర్థిక ముందుచూపుతో వ్యవహరించాలని గుర్తుంచుకోండి. కొన్ని లగ్జరీ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి మార్గాలు అన్వేషిస్తారు. పెద్దల మాట వింటే సత్ఫలితాలు పొందుతారు. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: తాతలు తండ్రులు అంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్!

Also Read: TS Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..విద్యా శాఖలో పోస్టుల భర్తీకి అనుమతులు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x