Kaleshwaram Pumps: గోదావరి వరదలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తడంతో పాటు రాజకీయంగా కొత్త వివాదాలకు కారణమవుతున్నాయి. భద్రాచలం సహా వందలాది గ్రామాలు నీట మునగడం వివాదమవుతోంది. పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం ముంపుకు గురవుతుందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు. పోలవరంపై టీఆర్ఎస్ మంత్రులు చేస్తున్న ఆరోపణలకు ఏపీ మంత్రులు కౌంటరిస్తున్నారు. ఇక గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పంప్ హౌజ్ లు మునిగిపోయాయి. కేసీఆర్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్లే వేల కోట్ల రూపాయల పంప్ హౌజ్ లు నీటమునిగాయని తెలంగాణ విపక్షాలు మండిపడుతున్నాయి. వేల కోట్ల రూపాయలను కేసీఆర్ నీటి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా పోలవరం ప్రాజెక్ట్ ,  భద్రాచలం ముంపు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నీట మునగడంపై తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి,  ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  పోలవరం ప్రాజెక్టుతో  లక్ష ఎకరాల వరకు గోదావరిలో మునిగిపోతాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్‌తో లక్షల ఎకరాల్లో పంట నష్టంతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలకు గండం ఉందని  రజత్ కుమార్ చెప్పారు. శ్రీరాముడి నిలయం భద్రాచలంతో పాటు పర్ణశాల మునిగిపోతాయన్నారు. పోలవరం బ్యాక్ విషయంలో స్టడీ చేయాలని చాలా సార్లు కేంద్రానికి  నివేదించామని రజత్ కుమార్ తెలిపారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై తాము లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రం ఇంతవరకు స్పందించలేదన్నారు.


గోదావరి వరదలో మునిగిపోయిన కాళేశ్వరం పంప్ హౌజులపైనా స్పందించారు ఇరిగేషన్ చీఫ్ రజత్ కుమార్. నీటిలో మునిగిన పంప్ హౌజ్ మరమ్మత్తుల ఖర్చులు 3 వందల కోట్ల రూపాయలు అవుతాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. పంప్ హౌజ్ ల రిపేర్లకు అయ్యే ఖర్చు 20 కోట్లకు మించదని  రజత్ కుమార్ చెప్పారు. మరమత్తుల  ఖర్చు కూడా ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్లే భరిస్తారని రజత్ కుమార్ తెలిపారు. బురదలో మునిగిన పంప్ హౌజ్ ల రిపేర్లు పూర్తి చేసి సెప్టెంబర్ లోపు మళ్లీ రన్ చేస్తామని వెల్లడించారు. కేంద్ర పరిధిలోని 18 సంస్థలు అనుమతి ఇచ్చిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగిందన్నారు రజత్ కుమార్. వందేళ్ల తర్వాత కుండపోత వర్షాలు కురిశాయని తెలిపారు. కడెం ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేశాం కాబట్టే గతంలో ఎప్పుడు లేనంత వరదలు వచ్చినా డ్యామ్ సేఫ్ గా ఉందన్నారు.


Read aslo :  Rythu Bheema:తెలంగాణ రైతులకు అలర్ట్.. రైతు బీమాలో మార్పులకు ఇవాళ ఒక్కరోజే అవకాశం  


Read aslo :  Bimbisara: టాప్ ప్రొడ్యూసర్ తో బింబిసార చూసిన ఎన్టీఆర్... కీలక నిర్ణయం!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook