Telangana adds 1,052 new Covid cases, 2 deaths, 10 omicron cases in last 24 hours : తెలంగాణలో కోవిడ్‌ విజృంభిస్తోంది. తాజాగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి మార్క్‌ను దాటింది. గతేడాది జూన్ తర్వాత ఫస్ట్ టైమ్ ఇప్పుడే తెలంగాణలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 42,991 కోవిడ్‌ టెస్ట్‌లు (Covid Tests)నిర్వంహించారు. 1,052 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసులు 6,84,023కు పెరిగాయి. ఇప్పటి వరకు మొత్తం 6,75,132 మంది కోవిడ్ (Covid) నుంచి కోలుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ (Telangana Medical Health Department) ఒక బులిటెన్‌ రిలీజ్ చేసింది. ఇక గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో కోవిడ్‌తో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 4,033కు పెరిగింది. కోవిడ్ నుంచి తాజాగా 240 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,858 యాక్టివ్ కోవిడ్ కేసులు (Active Covid cases) ఉన్నాయి.


ఇక మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులు (Telangana Omicron cases) కూడా పెరిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 10 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా (Omicron positive) తేలింది. దీంతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 144కు పెరిగింది. తాజాగా ఎట్‌ రిస్క్‌ కంట్రీస్‌ నుంచి వచ్చిన ఐదుగురికి, అలాగే నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన మరో ఐదుగురికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలింది.


Also Read : IIT Kharagpur: ఐఐటీ ఖరగ్​పూర్​లో కరోనా కలకలం


ఇప్పటివరకు తెలంగాణలో ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ కంట్రీస్‌ నుంచి వచ్చిన 13,405 మందికి ఆర్‌జీఐఏలో కోవిడ్ (Covid) టెస్ట్‌లు చేశారు. అందులో 189 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారి శాంపిల్స్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా 45 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌ వచ్చింది. 144 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ట్రీట్‌మెంట్ తర్వాత ఒమిక్రాన్‌ (Omicron) నుంచి 37 మంది కోలుకోగా 50 మంది ఫలితాలు రావాల్సి ఉంది.



 


Also Read : Andhra Pradesh: కొత్తవలసలో ఉపాధ్యాయుడు సహా 19మంది విద్యార్థులకు కరోనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి