Corona Cases in Delhi: దేశవ్యాప్తంగా కరోనా ((Coronavirus) కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో..దేశ రాజధాని ఢిల్లీ కొవిడ్ కేసులు (Delhi Corona Update) శరవేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 65,487 మందికి కరోనా పరీక్షలు చేయగా... ఢిల్లీలో 5,481 కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైరస్ తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని కేసులు నమోదవ్వడం మే 16 తర్వాత మళ్లీ ఇప్పుడే. దేశ రాజధానిలో ప్రస్తుతం 14, 889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు ౮.౩౭ శాతానికి పెరిగింది. ఇప్పటివరకు ఢిల్లీలో 3,29,98,171 మంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
COVID19 | Delhi reports 5,481 new cases & 3 deaths; Active cases 14,889. Positivity rate rises to 8.37% pic.twitter.com/G1Jq0Fx9zK
— ANI (@ANI) January 4, 2022
ఆరోగ్య శాఖ ప్రకారం, రాష్ట్రంలో ప్రత్యేక కోవీడ్ కేర్ సెంటర్ల సంఖ్య 4,547. వీటిలో రోగులు చికిత్స పొందుతున్న కేంద్రాలు ౩౨౪ ఉన్నాయి. 531 మంది కరోనా సోకిన రోగులను ఢిల్లీలోని ఆసుపత్రుల్లో చేర్చారు. హోమ్ ఇసోలేషన్ లో ఉంటూ... 8,593 చికిత్స తీసుకుంటున్నారు. కొవిడ్ తీవ్రత నేపథ్యంలోనే.. ఈ వారాంతం నుంచి వీకెండ్ కర్ఫ్యూను (Weekend Curfew) అమల్లోకి తెస్తున్నట్లు డీడీఎంఏ (DDMA) ప్రకటించింది. ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూను అమలు చేయాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: Delhi Weekend Curfew: దేశ రాజధానిలో కరోనా ఉద్ధృతి.. ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
ఈ వీకెండ్ కర్ఫ్యూలో భాగంగా.. 50% మంది ఉద్యోగులు ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలకు రావడానికి అనుమతించబడతారు. వైద్య దుకాణాలు, ఆసుపత్రులు, ఆహార పదార్థాలను అందించే దుకాణాలు వంటి ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతాయి. షాపింగ్ మాల్స్, సెలూన్స్ వంటి అత్యవసరం సేవల కిందకు రాని దుకాణాలు మూతబడతాయి. మెట్రో, బస్సులను సగం సామర్థ్యంతో నడుస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో 'ఎల్లో అలెర్ట్' (Yellow Alert) అమలులో ఉన్న కారణంగా స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, జిమ్ సెంటర్లు మూతపడ్డాయి. దుకాణాలు, మాల్స్‌ను సరి-బేసి పద్ధతిలో తెరుచుకునేందుకు అనుమతినిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి