Bandi Sanjay Speech At BJP Unemployment March: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కంటే సీఎం కేసీఆర్ డేంజర్ అని.. అతీక్ గన్ పెట్టి దోచుకుంటే కేసీఆర్ పోలీసులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గ్యాంగ్ స్టర్లకే గ్యాంగ్ స్టర్ కేసీఆర్ అని అన్నారు. అయినా తాము భయపడే ప్రసక్తే లేదని.. నష్టపోయిన యువతకు న్యాయం జరిగే వరకు కొట్లాడతూనే ఉంటామని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం ప్రమేయంతోనే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. మహబూబ్‌ ​నగర్ ​జిల్లాలో బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌​లో ఆయన ప్రసంగించారు. ఈ సంద్భంగా సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. వేలాది మంది నిరుద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీచర్ల తరుఫున 317 జీవోను సవరించాలని ఉద్యమించి జైలుకు వెళ్లానని.. టీచర్లంతా కేసీఆర్‌పై కసితో తీర్పు ఇచ్చారని అన్నారు. ఇదే పాలమూరు గడ్డ మీద నుంచి క్లాక్ టవర్ సాక్షిగా చెబుతున్నా కేసీఆర్‌కు కౌంట్ డౌన్ స్టార్టయిందన్నారు. పాలమూరు జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోందని జోస్యం చెప్పారు. తనకు జైలు కొత్తకాదని.. తొమ్మిది సార్లు జైలుకు వెళ్లి వచ్చానని అన్నారు. 


'మొన్న నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంటే.. నన్ను అర్దరాత్రి అరెస్టు చేశారు. 8 గంటలు రోడ్లపైనే తిప్పారు. నన్ను ఎటు తీసుకుపోతున్నరో కూడా అర్ధం కాలేదు. కానీ నేను భయపడలేదు. కానీ కేసీఆర్ ఫాంహౌజ్ దగ్గరకు పోగానే అక్కడ నిమ్మకాయలున్నయ్.. కొంపదీసి నన్ను బలి ఇస్తారేమననే అనే అనుమానం వచ్చింది. అయినా భయపడలేదు. కేసీఆర్ కుటుంబ పాలనను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.. నన్ను ఎక్కడ అరెస్ట్ చేశారో.. ఎక్కడ నా కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారో అదే ఓరుగల్లు గడ్డపై నుంచే నిరుద్యోగ మార్చ్ నిర్వహించి విజయవంతం చేసి పాలమూరు గడ్డకు వచ్చాం..' అని బండి సంజయ్ అన్నారు. 


టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని.. పేపర్ లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలన్నారు. పాలమూరుకు నీళ్లు రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని.. అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఓట్లు దండుకుని ఏం చేశారని నిలదీశారు. ఇద్దరు చేసిన తప్పిదమే పేపర్ లీకేజీకి కారణమని కేటీఆర్ అన్నారని.. మరి 50 మందిదాకా ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. 


Also Read: AP Inter Results 2023: నేడే ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  


కేసీఆర్ బిడ్డ కిలోల లెక్క నెయ్యి  తింటోందని.. కేసీఆర్ కుటుంబానికి నెయ్యి.. నిరుద్యోగులకు గొయ్యి.. రైతులకు నుయ్యి మాదిరిగా తయారైందంటూ విమర్శించారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే శిథిలావస్థకు చేరిన ఉస్మానియా వర్శిటీని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాకతీయ వర్శిటీ భవనాలను నిర్మిస్తామన్నారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్‌ను ఏటా విడుదల చేస్తామని అన్నారు. 


Also Read: SRH Vs DC Highlights: ఇంట్రెస్టింగ్ సీన్.. భువనేశ్వర్ కాళ్లు పట్టుకున్న డేవిడ్ వార్నర్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook