KTR Fires Over Congress Manifesto: కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే తప్ప, చేతల ప్రభుత్వం కాదని జనాలకు తెలుసని బీఆర్ఎస్ మాజీ మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ను మల్కాజ్ గిరి లో మడత పెట్టీ కొట్టుడే అని ఆయన రేవంత్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చేసిన 420 హామీలను నమ్మి జనం మోసపోయారని కేటీర్ ఎద్దెవా చేశారు.  ఉప్పల్ లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా?.. లేక కాంగ్రెసోడు ఉన్నాడా అర్దం కావటం లేదన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను బొంద పెట్టుడేనని కే తారకరామరావు అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Disha Patani: దిశా పటాని హాట్ షో.. ఇక చాలు బాబోయే అంటున్న కుర్రకారు..


రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ను జనం చూసి అస్యహించుకుంటున్నారని తెలిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. లంకె బిందెల కోసం దొంగలు తిరుగుతారు..  గతంలో రేవంత్ రెడ్డి అదే కావచ్చు నాకైతే తెలియదని సెటైర్ లు వేశారు. రేవంత్ రెడ్డి లాగా మేము తిట్టగలుతాం.. కానీ వారి గౌరవానికే వదిలేస్తున్నామన్నారు.


మొన్న తెలంగాణలో వచ్చిన అంసెబ్లీ ఎన్నికల పలితాలు మన మంచికే వచ్చాయన్నారు. చీకటి ఉంటేనే కదా..  వెలుగు విలువ తెలుస్తుంది.. ఇప్పుడు.. నికృష్ట కాంగ్రెస్ పాలన జనానికి పూర్తిగా తెలిసోస్తుందని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమోచ్చినట్లు పాలన చేస్తుందన్నారు. ఏది చేయాలన్న కూడా ఢిల్లీ పెద్దలచుట్టు తిరుగుతు ఉంటారని కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.


Read More: Masala Chai: మసాలా చాయ్ ఇప్పుడు ప్రపంచంలో 2వ బెస్ట్‌ డ్రింక్‌, దీని ఎలా తయారు చేసుకోవాలి అంటే..


అయితే.. పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ప్రజల్లో కూడా బీఆర్ఎస్ కు ఉన్న వ్యతిరేకతను పొగొట్టడానికి నాయకులు, మంత్రులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక గులాబీబాస్ కేసీఆర్  కూడా ఆరోగ్యం కుదుటపడి మరల తెలంగాణ భవన్ లో ఎంట్రీ ఇవ్వడంతో బీఆర్ఎస్ కు మరింత బలం చేకూరినట్లైంది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook