Rajiv Gandhi Statue infront of Telangana Secretriate: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమున్నట్లు దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సచివాలయంలో సీఎం రేవంత్ రాజీవ్ గాంధీ విగ్రహనికి శంకుస్థాపన చేయడంను, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని నిరూగార్చేకుట్ర అని ఎద్దేవా చేశారు. అయితే.. తొలుత సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహంను ఏర్పాటు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ భావించింది. దీనిలో భాగంగానే గత ప్రభుత్వం హయాంలోనే అమరుల త్యాగాలు స్మరించుకునేలా.. అమరజ్యోతిని ఇప్పటికే ఏర్పాటు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్..


కొత్తగా  ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు మాత్రం అక్కడ రాజీవ్  గాంధీ విగ్రహం ఏర్పాటుకు పనులు కూడా ప్రారంభించింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దివంగత నేత.. టెలికాం రంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. అదే విధంగా దేశ సమగ్రతనకు, సోదరభావంకు పాటు పడి ప్రాణాలు సైతం అర్పించిన మహానీయుడని కొనియాడారు. ఇప్పటి దాక.. ట్యాంక్ బండ్ లోఏదో ఒక లోటుగా ఉండేదని, ఇప్పుడు మాత్రం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంతో అది పూర్తవుతుందని అన్నారు.


రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు సోనియా గాంధీని ఆహ్వనించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఇక మరోవైపు ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాల్లో.. ఇందిరాగాంధీ, పీవీ నర్సింహరావు, జైపాల్ రెడ్డి విగ్రహలు ఉన్నాయని గుర్తు చేశారు. దీనికి అదనంగా రాజీవ్ గాంధీ విగ్రహం కూడానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల అస్తిత్వానికి మరోసారి తూట్లు పొడిచేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.


Read More: Praveen IPS: విడుదలైన ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్.. ఫిబ్రవరి 16న థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా..


అమరులకు నివాళిగా.. నిర్మించిన అమరజ్యోతి ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు . ఇప్పటికే, ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శాసనమండలి చైర్మన్ అనుమతి తీసుకున్నట్లు సమాచారం.  తెలంగాణ తల్లి విగ్రహం,  తెలంగాణకు అస్తిత్వానికి ఎంతో ముఖ్యం. మన రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook