విజృంభిస్తోన్న మహమ్మారి.. తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు
Telangana COVID19 Cases | కరోనా వైరస్ టెస్టులు తక్కువగా చేస్తున్నప్పటికీ తెలంగాణలో కుప్పలు తెప్పలుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 983 కరోనా కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
Telangana CoronaVirus Cases | దేశంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్19 కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 983 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో సాయంత్రం 5గంటల వరకు నలుగురు వ్యక్తులను కరోనా మహమ్మారి బలి తీసుకుంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ(GHMC COVID19 cases) పరిధిలో 816 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు కేరళ నర్సులు
తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి చేరింది. తాజా నాలుగు మరణాలతో కలిపితే రాష్ట్రంలో కరోనాతో 247 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 244 మంది ప్రాణాంతక కోవిడ్19 మహమ్మారి బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ