Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజులనుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో కరోనా నుంచి 1,367 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.86 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Covid-19: ఢిల్లీలో మళ్లీ వంద దాటిన కరోనా మరణాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో ( నవంబరు 20న ) శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా  కొత్తగా 925 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా మగ్గురు (3) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,62,653 కి చేరగా.. మరణాల సంఖ్య 1,426 కి పెరిగింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,49,157 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 12,070 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. Also raed: Uttar Pradesh: కల్తీ మద్యం తాగి నలుగురు మృతి


ఇదిలావుంటే.. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా 42,077 కరోనా పరీక్షలు జరిపారు. వీటితో కలిపి నవంబరు 20వ తేదీ వరకు మొత్తం 50,92,689 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  హైదరాబాద్ పరిధిలో 161 కేసులు నమోదయ్యాయి. 


[[{"fid":"198620","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]