కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడి ఎంసెట్ 2020 పరీక్ష (Telangana EAMCET 2020)కు హాజరుకాలేకపోయిన తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. ఈ విద్యార్థుల కోసం అక్టోబర్ 8న ప్రత్యేకంగా ఎంసెట్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తెలంగాణ ఎంసెట్ 2020 నిర్వహించారని తెలిసిందే. కరోనా కారణంగా ఈ ఎగ్జామ్‌కు హాజరుకాలేని వారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే! 


అయితే ఆ విద్యార్థులు ముందుగా తమ కరోనా పాజిటివ్, కరోనా నెగిటివ్ లాంటి సర్టిఫికెట్లతో పాటు ఎంసెట్ హాల్ టికెట్‌ను కన్వీనర్ ఈమెయిల్‌కు అక్టోబర్ 5 అర్ధరాత్రి లోగా పంపించాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వివరాలు, ఇతరత్రా సమాచారాన్ని తెలియజేయనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. 
convenertseamcet2020@jntuh.ac.in మెయిల్ ఐడీకి వివరాలు పంపాల్సి ఉంటుంది. 


తెలంగాణ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe