Telangana: కరోనా నిబంధనలతో బార్లు, క్లబ్బులు ప్రారంభించవచ్చు..కానీ
తెలంగాణ (Telangana ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వైరస్ ( Covid-19 ) వల్ల లాక్ డౌన్ విధించడం... బార్లు, క్లబ్బులను మూసేయమని ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ (Telangana ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వైరస్ ( Covid-19 ) వల్ల లాక్ డౌన్ విధించడం... బార్లు, క్లబ్బులను మూసేయమని ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి బార్లు, క్లబ్బులు తెరుచుకోలేదు. కాగా ఇటీవలే వైన్ షాపులు మాత్రం తెరుచుకున్నాయి. అదే సమయంలో బార్లు, క్లబ్స్ తెరిచేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే పర్మిట్ రూమ్స్ కు మాత్రం ప్రభుత్వం నో అంది.
ALSO READ | Telangana New Revenue Act: కొత్త రెవెన్యూ చట్టం.. హైలైట్స్
బార్లు, క్లబ్బులను తెరవడానికి ప్రభుత్వం అనుమతించినా కానీ కరోనావైరస్ ( Coronavirus ) నియమాలను మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే అని షరతు పెట్టింది. కోవిడ్-19 నియంత్రణ కోసం చర్యలు తీసుకోకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవు అని తెలిపింది. ఇక బార్లు, క్లబ్బుల్లో మ్యూజికల్ ఈవెంట్స్, డ్యాన్స్ లు నిషేధించారు.
ఉత్తర్వుల ప్రకారం పాటించాల్సిన నియమాలు, నిబంధనలు ఇవే
- పార్కింగ్ ప్లేస్ లో ప్రజలు సమూహంగా ఏర్పడకుండా చూసుకోవాలి.
- తప్పకుండా శానిటైజర్ అందుబాటులో ఉంచాలి.
- హైజీనిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. క్యూ సిస్టమ్ పాటించాలి
ALSO READ : GRAND ICT Challegne: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తే.. రూ.50 లక్షలు మీకే సొంతం
- థర్మల్ స్కానింగ్ తప్పకుండా ఉండాలి.
- తగిన వెంటిలేషన్ ఉండాలి.
- సంగీత కార్యక్రమాలు, డ్యాన్స్ నిషేధం.
- కస్టమర్స్ వెళ్లిన తరువాత వారు కూర్చున్న చోటును తప్పకుండా శానిటైజ్ చేయాలి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR