TS Governor Tamilsai: తెలంగాణ మహిళలకు తాను అండగా ఉంటానని గవర్నర్  తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. తనను ఎవరూ అడ్డుకోలేరన్నారు. సమస్యలను వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. ఏ పని చేసినా ప్రజల కోసమేనని తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్బంగా మహిళల సమస్యలపై ఆరా తీశారు. వృద్ధుల సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై గవర్నర్‌కు మహిళలు ఫిర్యాదు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం మాట్లాడారు. తెలుగులోనే స్పీచ్ ప్రారంభించిన గవర్నర్..మహిళల సమస్యలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. మహిళలను ఆదుకోవడానికి ఎప్పుడు ముందు ఉంటానని..శక్తిలా పనిచేస్తానన్నారు. ప్రజలను గవర్నర్ కలుస్తారా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారని..కానీ తాను మాత్రం ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు. కరోనా సమయంలోనూ రోగులను పరామర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. సమాజంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..వారికి అండగా ఉంటానని చెప్పారు. 


మహిళలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానన్నారు గవర్నర్ తమిళిసై. ఈ విషయంలో ఎదురు చెప్పే వాళ్లను పట్టించుకోనని తేల్చి చెప్పారు. నిరసనకారుల నుంచి అసలు పట్టించుకోనన్నారు. మహిళ స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తానని తెలిపారు. ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా లోకానికి మద్దతు అవసరమని..మనం గెలుస్తాం..మన గెలుపును ఎవరూ ఆపలేరని వ్యాఖ్యనిచ్చారు. 


మహిళా దర్బార్ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో ఇలాంటి కార్యక్రమాలు ఏంటని ప్రశ్నిస్తున్నారని..ప్రజల కోసమే రాజ్‌భవన్‌ అని చెప్పారు. రాజ్‌భవన్‌ పొలిటికల్ కార్యాలయం కాదన్నారు గవర్నర్. హైదరాబాద్ గ్యాంగ్ రేప్‌ ఘటనపై రెండురోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించానని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం..సరైన ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. ఎన్నికైనా ప్రభుత్వాన్ని తాను గౌరవిస్తానని..ప్రభుత్వం కూడా అలాగే స్పందించాలన్నారు.



 


Also read:Minor Rape Victim: రెచ్చిపోతున్న కామాంధులు..హైదరాబాద్‌లో మరో దారుణం..!


Also read:Health Care Tips: అదే పనిగా కాళ్లు కదుపుతున్నారా.. అయితే మీలో ఈ లోపం ఉన్నట్లే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook