New Pay Scale: తెలంగాణ SERP ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెరవేరిన 23 ఏళ్ల కల.. కొత్త పే స్కేలు వర్తింపు
New Pay Scale to SERP Employees: సెర్ప్ ఉద్యోగుల 23 ఏళ్ల కల నెరవేరింది. సీఎం కేసీఆర్ హామీ మేరకు వారి జీతాలు ఒకేసారి భారీస్థాయిలో పెరిగాయి. సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
New Pay Scale to SERP Employees from April 1st: సెర్ప్ (పేదరిక నిర్మూలనా సంస్థ) ఉద్యోగులకు ఉగాది కానుకగా తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన మేరకు.. వారికి కొత్త పే స్కేలు వర్తింప చేస్తూ జీవోను జారీ చేసింది ప్రభుత్వం. దీంతో 23 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సెర్ప్ ఉద్యోగుల కల నెరవేరింది. తాజా జీవోతో వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. కొత్త పే స్కేలు మొత్తం 3,978 మంది ఉద్యోగులకు వర్తించనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పే స్కేలు అమలులోకి వస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు.
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల సాకారం అవ్వడంతో సెర్ప్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి.. తమ డిమాండ్ సాకారం అయ్యే విధంగా కృషి చేసిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కవితకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబురాలు చేసుకుంటున్నారు.
సెర్ప్ ఉద్యోగులకు కొత్త పే స్కేలు అమలు చేస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ కూడా ఈ నెల 15వ తేదీన వారికి గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ క్రమంలోనే సెర్ప్ ఉద్యోగులకు సవరించిన వేతనాలతో కూడిన కొత్త పే స్కేల్ వర్తింపజేస్తూ జీవో నెంబర్ 11ను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 3,978 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సెర్ప్ ఉద్యోగుల జీతనా భారీగా పెరగనుండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.58 కోట్ల అదనపు భారం పడనుంది. సెర్ప్ ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేల నుంచి రూ.58,850లు అయింది. గరిష్ఠ పేస్కేలు రూ.51,320 నుంచి 1,27,310 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
పే స్కేల్ సవరణ జీవో రావడంతో సెర్ప్ ఉద్యోగుల ముఖాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆదివారం మంత్రులను ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేయనున్నారు.
Also Read: PF Account: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి
Also Read: New Income Tax Rules 2023: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పకుండా తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి