తెలంగాణ ( Telangana ) ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR ) పక్కా వ్యూహం వల్ల తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతోంది అన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ( KTR ). ఆహారశుద్ధి రంగంలో ఉన్న అవకాశాల గురించి ప్రగతి భవన్ లో నిర్వహించిన సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెటేషన్ ఇచ్చారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ విషయంలో సరికొత్త విధానాల వల్ల తెలంగాణకు భారీగా పరిశ్రమలు తరలి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



ఆహార శుద్ధి ( Food Processing ), లాజిస్టిక్స్ వల్ల యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి అని తెలిపారు కే తారకరామారావు ( K Taraka Rama Rao ) . ప్రజలకు కల్తీ లేని ఫుడ్ ప్రోడక్ట్స్ అందించగలం అని తెలిపారు. ప్రగతి భవన్ లో ( Pragathi Bhavan ) నిర్వహించిన సమావేశంలో పలువురు మంత్రులు, అధికారులతో కలిసి కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది అని. అదే సమయంలో పరిశ్రమలు, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమం, పశుసంవదర్ధక శాఖల అధికారులు అమలు చేస్తున్న పాలసీల గురించి కూడా మాట్లాడారు.  సుమారు ఎనిమిది గంటల పాటు ఈ సమావేశం జరిగింది.  CM YS Jagan: AMRDA పై సమీక్ష నిర్వహించిన జగన్