Telangana politics: హైదరాబాద్: కరోనావైరస్ ( Coronavirus) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana govt)పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP chief JP Nadda) నిరాధార ఆరోపణలు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ (Minister Etela Rajender) విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతిని ఎందుకు కట్టడిచేయలేదో చెప్పాలని ఆయన బీజేపీ నేతలను ప్రశ్నించారు. శనివారం జరిగిన బీజేపీ జన్ సంవాద్ వర్చువల్ ర్యాలీ ( BJP virtual rally)లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఆరోపణలు చేసుకునే సమయం కాదని, నడ్డా ఆరోపణలు నిరాధరమైనవని ఈటల ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ స్థాయి నాయకుడు గల్లీ లీడర్‌లా మాట్లాడారని ఎద్దెవా చేశారు. కరోనా ప్రపంచస్థాయి సమస్య అని చెప్పారు. ( Read also: ఆ థెరపీ సక్సెస్.. వేగంగా కోలుకుంటున్న ఢిల్లీ ఆరోగ్యమంత్రి )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. " కరోనావైరస్ వ్యాప్తి విషయంలో అందరికంటే ముందు తామే అప్రమత్తమయ్యామని, తెలంగాణలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం సీఎం కేసీఆర్ ( CM KCR) ఆ వ్యవస్థను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను ( Lockdown) పూర్తిగా అమలు చేశామని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర బృందాలే హర్షం వ్యక్తం చేశాయని ఈటల చెప్పారు. 


మర్కజ్ ఘటనలో ఢిల్లీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని, కరోనా విషయంలో ప్రధానిని ఇతర పార్టీలు విమర్శిస్తే తప్పని చెప్పామని మంత్రి ఈటల గుర్తుచేశారు. ప్రధానికి అండగా నిలిచిన రాష్ట్రంపై ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి ఈటల రాజేందర్ హితవు పలికారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..