Telangana High Court: హైదరాబాద్: కరోనా (Coronavirus) విపత్కర పరిస్థితుల్లో తెలంగాణలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనావైరస్ చికిత్స, ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలపై న్యాయవాది కిషన్ శర్మ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు (Private Hospitals) చట్టాలను ఉలంఘిస్తున్నాయని, చర్యలు తీసుకోవాలని, ఇందుకు సరైన మర్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. Read also: Secretariat Demolition: తెలంగాణ చరిత్రలో నేడు బ్లాక్ డే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా హైకోర్టు.. హైదరాబాద్ (Hyderabad) నగరంలో అధిక బిల్లులు వసూలు చేసిన పలు ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. కరోనా పరీక్షలు, బిల్లుల విషయంలో నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించింది.  దీనిపై ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు పట్టించుకోకపోవడం శోచనీయమని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన ఆయా ఆసుపత్రులపై ప్రభుత్వం (Telangana Govt) చర్యలు తీసుకుందని భావిస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో ఈ నెల 14తేదీ లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. Also read: Telangana: తెలంగాణలో పాత సచివాలయం కూల్చివేత ప్రారంభం


జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..