Secretariat Demolition: తెలంగాణ చరిత్రలో నేడు బ్లాక్ డే..

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నేడు బాధాకరమైన రోజు అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ నమ్మకాల కోసం 4 కోట్ల ప్రజలను పణంగా పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Last Updated : Jul 7, 2020, 06:02 PM IST
Secretariat Demolition: తెలంగాణ చరిత్రలో నేడు బ్లాక్ డే..

హైదరాబాద్:  తెలంగాణ ( Telangana) రాష్ట్ర చరిత్రలో నేడు బాధాకరమైన రోజు అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ నమ్మకాల కోసం 4 కోట్ల ప్రజలను పణంగా పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) ప్రభుత్వం తప్పులు చేస్తే న్యాయవ్యవస్థ కలుగజేసుకునేది. కానీ ఇవాళ న్యాయవ్యవస్థ పై కూడా తెలంగాణ సమాజం అసంతృప్తితో ఉందన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగే లోపే కూల్చివేత పనులు పూర్తి చేయాలనే ఆలోచనతోనే (Secretariat Demolition) సచివాలయాన్ని కూల్చుతున్నారని ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్‌ నివాసం వద్ద కాంగ్రెస్‌ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో నేడు ఒక బ్లాక్ డే అని అంతేకాకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేనప్పుడు 500 కోట్లతో సచివాలయం నిర్మాణం అవసరమా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 Also read: కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలం

సీఎం కేసీఆర్ తన కుటుంబ అవసరాల కోసం తెలంగాణ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారని, సీఎస్ సోమేశ్ కుమార్ కేసీఆర్‌కు తొత్తుగా మారారని విరుచుకుపడ్డారు. (Hyderabad) హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో సీఎం ఎక్కడున్నారని, ప్రభుత్వం చూపించే లెక్కలకు క్షేత్ర స్థాయిలో లెక్కలకు చాలా తేడా ఉందన్నారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలని, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. 

జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

 

Trending News