High Court Verdict On MLCs Kodandaram And Aamir Ali Khan: తెలంగాణలో ఎంపీ  ఎన్నికల ముందు రాజకీయాలు మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు నువ్వా ... నేనా .. అన్నట్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అధికార దుర్వినియోంపై ప్రతిరోజు విమర్శలు చేస్తున్నాయి. ఇక.. బీఆర్ఎస్ కూడా అంతే ధీటుగా.. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొడుతుంది. ఈ క్రమంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎంపికపై కూడా తీవ్ర రచ్చగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Yogasanam: ఈ ఐదు యోగాసనాలు వేస్తే చాలు మానసిక, శారీరక సమస్యలు దూరం


బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎంపిక చేసి, గవర్నర్ తమిళిసై ఆమోదానికి పంపారు. కానీ గవర్నర్.. వీరిని కొన్ని కారణాలతో రిజక్ట్ చేశారు. దీనిపై లిఖిత పూర్వకంగా గవర్నర్ కార్యాలయం అప్పటి ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. కానీ దీనిపై అప్పటి బీఆర్ఎస్  ప్రభుత్వం వెనక్కుతగ్గకుండా.. గవర్నర్ కావాలనే ఇలా చేస్తున్నారని, దీనిపై హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ లను ఎంపిక చేని గవర్నర్ ఆమోదానికి పంపారు.


అయితే.. దీనిపై వెంటనే తమిళిసై ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఈ క్రమంలో దీనిపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. గవర్నర్ కావాలనే రాజ్యంగ విరుద్ధంగా ప్రవర్తించారని, హైకోర్టులో వీరి నియామకంపై సవాల్ చేస్తూ కూడా పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే.. ఈ రెండు పిటిషన్ లపై విచారించిన కోర్టు.. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడం రాజ్యంగ విరుధ్దమని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.


Read More: Shraddha Das: క్లీవేజ్ షోతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న శ్రద్దా దాస్.. లేటెస్ట్ పిక్స్ చూస్తే తట్టుకోలేరేమో..


అదే విధంగా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా నియమించిన ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకం ను కొట్టివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం... కొత్తగా ఎమ్మెల్సీల నియామకం ప్రక్రియ చేపట్టాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook