Yogasanam: ఈ ఐదు యోగాసనాలు వేస్తే చాలు మానసిక, శారీరక సమస్యలు దూరం

ప్రాచీన భారతదేశం నుంచి ఇప్పుడు మొత్తం ప్రపంచం వరకూ విస్తరించిన అద్భుత వ్యాయామ సాధనం యోగా. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది యోగాతో. క్రమం తప్పకుండా కొన్ని యోగాసనాలు వేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమౌతుంది. వివిధ రకాల సమస్యల కారణంగా ఎదురయ్యే ఆందోళన నుంచి ప్రశాంతత పొందవచ్చు. 

Yogasanam: ప్రాచీన భారతదేశం నుంచి ఇప్పుడు మొత్తం ప్రపంచం వరకూ విస్తరించిన అద్భుత వ్యాయామ సాధనం యోగా. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది యోగాతో. క్రమం తప్పకుండా కొన్ని యోగాసనాలు వేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమౌతుంది. వివిధ రకాల సమస్యల కారణంగా ఎదురయ్యే ఆందోళన నుంచి ప్రశాంతత పొందవచ్చు. 

1 /5

శవాసనం ఈ ఆసనం శరీరానికి , మనస్సుకు పూర్తిగా విశ్రాంతినిస్తుంది. శవాసనం వల్ల ఒత్తిడి తొలగిపోతుంది. మంచి సుఖనిద్ర పడుతుంది. రోజూ చేస్తే మంచి ఫలితాలు చూడవచ్చు

2 /5

వృక్షాసనం ఈ ఆసనం ఏకాగ్రత, సమతుల్యతకు దోహదం చేస్తుంది. వృక్షాసనం వేయడం వల్ల మనస్సుకు శాంతి కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది.

3 /5

బాలాసనం ఈ ఆసనం మానసిక ప్రశాంతతు కల్గిస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. బాలాసనం వేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అలసట దూరమౌతుంది. 

4 /5

భుజంగాసనం ఈ ఆసనం వీపు, భుజాల్ని స్ట్రెచ్ చేస్తుంది. దాంతో ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది. భుజంగాసనం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. 

5 /5

అనులోమ విలోమ ఆసనం ఇదొక ప్రాణాయామ ఆసనం. ఇందులో శ్వాసను నియంత్రించవచ్చు. అనులోమ, విలోమ ప్రక్రియ ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. రోజూ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.