Telangana Inter Admissions | ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకునే చివరి తేదీనీ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) పొడగించింది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ చివరి తేదీని నవంబర్ 16 తేదీకి పొడగించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read |  జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ గురించి ఆసక్తికరమైన విషయాలు


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ( Telangana ) ఉన్న ప్రభుత్వ, ప్రైవేటూ ఎయిడెడ్, ప్రైవేట్ నాన్ ఎయిడెడ్, కో ఆపరేటీవ్స్, టీఎస్ రెసిడెన్షియల్, టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టీఎస్ మోడల్ స్కూల్, కేజీబీవీఎస్, ఇన్సెన్టీవ్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్న విద్యార్ధులు నవంబర్ 16 తేదీ గడువు తేదీ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.



Also Read | Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు 50 శాతం Cashback


విద్యార్థుల అడ్మిషన్స్ ను స్వీకరించాల్సిందిగా తెలంగాణ ఇంటర్మీడియట్ ( Intermediate ) బోర్డు కాలేజీలను ఆదేశించింది. నిజానికి అక్టోబర్ 31వ తేదీన ఇంటర్ అడ్మిషన్స్ పూర్తి అవ్వాల్సి ఉంది. మొదటి సంవత్సరం అడ్మిషన్స్ అనేవి సెప్టెంబర్ 16న మొదలు అయ్యాయి. ఆన్‌లైన్ క్లాసులు సెప్టెంబర్ 18న మొదలు అయ్యాయి. మరిన్ని వివరాల కోసం విద్యార్ధులు tsbie.cgg.gov.in పోర్టల్ విజిట్ చేయవచ్చు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR