Minister KTR: అమెరికా ఎంఐటీలా బాసర ట్రిపుల్ ఐటీని తీర్చిదిద్దుతాం: మంత్రి కేటీఆర్..!
Minister KTR: బాసర ట్రిపుల్ ఐటీలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈసందర్భంగా విద్యార్థుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
Minister KTR: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో మంత్రి కేటీఆర్ సంభాషించారు. విద్యార్థులతో లంచ్ చేసిన ఆయన ఆ తర్వాత వారితో ముచ్చటించారు. ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులతో కలిసి మాట్లాడిన తర్వాత ఐటీ ప్రాంగణంలో వారిని ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం కేసీఆర్ సహకారంతో..విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమన్వయంతో ట్రిపుల్ ఐటీని అభివృద్ధి చేస్తామన్నారు.
ట్రిపుల్ ఐటీలో టీ హబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో మినీ స్టేడియం, అధునాతన కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్, విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లను పంపిణీ చేస్తామన్నారు. మోడర్న్ క్లాస్ రూములను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. కాలేజీ ప్రాంగణంలో కొత్త మౌలిక వసతులు కల్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. మళ్లీ నవంబర్‌లో వస్తానని తెలిపారు.
అమెరికాలోని ఎంఐటీలాగా బాసర ట్రిపుల్ ఐటీ తీర్చిదిద్దుతామన్నారు. నవంబర్‌లో అందరికీ ల్యాప్ ట్యాప్‌లను పంపిణీ చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. మూడు కోట్లతో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్యాంపస్‌లో మరిన్ని కొత్త కోర్సులను తీసుకొస్తామన్నారు. ఆరు నెలలకు ఒకసారి ట్రిపుల్ ఐటీకి వస్తామని..ఇక్కడి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులంతా కలిసి వచ్చి మోడల్ క్యాంపస్‌లా మారేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల ఆందోళనలకు ప్రతి రోజూ చూశానని..రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు పోరాడానికి గుర్తు చేశారు. విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి తనకు నచ్చిందని..శాంతియుతంగా పోరాటం చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణలో అద్భుత ప్రతిభ కలిగిన విద్యార్థులంతా ఇక్కడే ఉన్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం క్యాంపస్‌లో ఉన్న మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేస్తామని..ఇందుకు అందరూ కలిసి రావాలన్నారు.
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఎంకరేజ్ చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో చిన్నారి చేసిన ఇన్నోవేషన్ ఎంతో నచ్చిందని చెప్పారు. ఈకార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also read:YS Sharmila: టీఆర్ఎస్‌కు ఆయనో కోవర్ట్..జగ్గారెడ్డిపై వైఎస్ షర్మిల ధ్వజం..!
Also read:Hyderabad Rains: భాగ్యనగరంలో భారీ వర్షం..ఇబ్బందులు పడుతున్న నగరవాసులు..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook