Telangana: వరంగల్‌లో మంత్రుల పర్యటన
తెలంగాణలో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహించాయి. చాలా ప్రాంతాలు ఇంకా వరద ప్రవాహంలోనే ఉన్నాయి.
Ministers visited flood affected areas in Warangal : హైదరాబాద్: తెలంగాణలో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా వర్షాలు ( heavy rains ) కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహించాయి. చాలా ప్రాంతాలు ఇంకా వరద ప్రవాహంలోనే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత పెద్ద నగరమైన వరంగల్ (Warangal) అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద ధాటికి రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (KCR) ఆదేశాలతో మంత్రులు కేటీఆర్ ( KTR ), ఈటల రాజేందర్ (Etela Rajender) వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు. మొదట ఏరియల్ వ్యూ ద్వారా నగర పరిస్థితిని వీక్షించారు. అనంతరం వారు వరద ముంపునకు గురైన నయీంనగర్, కేయూ 100 ఫీట్ రోడ్ పలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. Also read: India: 27 లక్షలు దాటిన కరోనా కేసులు
[[{"fid":"190878","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":" flood affected areas in Warangal","field_file_image_title_text[und][0][value]":"వరంగల్‌లో కేటీఆర్ పర్యటన"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":" flood affected areas in Warangal","field_file_image_title_text[und][0][value]":"వరంగల్‌లో కేటీఆర్ పర్యటన"}},"link_text":false,"attributes":{"alt":" flood affected areas in Warangal","title":"వరంగల్‌లో కేటీఆర్ పర్యటన","class":"media-element file-default","data-delta":"1"}}]]
ఈ సందర్భంగా జరిగిన నష్టం గురించి స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వరద బాధిత ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని, మరోసారి ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. అక్రమ నిర్మాణాల వల్లే ఈ సమస్య తలెత్తిందని, వాటిని తొలగిస్తామని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్, ఈటల వెంట స్థానిక మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. Also read: AP: భారీగా తెలంగాణ మద్యం పట్టివేత
[[{"fid":"190879","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ministers visited flood affected areas in Warangal","field_file_image_title_text[und][0][value]":"వరంగల్‌లో మంత్రుల పర్యటన"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ministers visited flood affected areas in Warangal","field_file_image_title_text[und][0][value]":"వరంగల్‌లో మంత్రుల పర్యటన"}},"link_text":false,"attributes":{"alt":"Ministers visited flood affected areas in Warangal","title":"వరంగల్‌లో మంత్రుల పర్యటన","class":"media-element file-default","data-delta":"2"}}]]