illegal liquor seized: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం ( Illicit Liquor Seized ) భారీగా పట్టుబడుతోంది. ఏపీ ( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో దళారులు బయటి రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలించి లక్షలు దండుకుంటున్నారు. ఏపీ పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నా.. అక్రమ మద్యం వ్యాపారం ఏమాత్రం ఆగడంలేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాకు తరలిస్తున్న లక్షన్నరకు పైగా విలువ చేసే మద్యం బాటిళ్లను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. Also read: India: 27 లక్షలు దాటిన కరోనా కేసులు
Liquor worth Rs 1.5 lakhs seized in Krishna District, while it was being transported illegally. One person has been detained: Sub Inspector Ranganath, Kanchikacharla Police Station. #AndhraPradesh pic.twitter.com/DlViVNj4mZ
— ANI (@ANI) August 18, 2020
తెలంగాణ సరిహద్దు నుంచి కారులో అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పెరకలపాడు దగ్గర అడ్డుకోని తనిఖీలు చేశారు. కారును, 500 మద్యం బాటీళ్లను సీజ్ చేసి, ఇద్దరు నిందితులను కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్ఐ రంగనాథ్ తెలిపారు. Also read: Kiran Mazumdar Shaw: కరోనా బారిన బయోకాన్ చీఫ్