BJP Deal With TRS MLAs: మునుగోడులో ఉప ఎన్నికలకు తేదీ సమీపిస్తుండటంతో అక్కడ గెలిచే ధైర్యం లేక తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కృత్రిమ రాజకీయ అనిశ్చిత పరిస్థితులను సృష్టించేందుకు బిజెపి కుట్రలు పన్నుతోందని టీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు ఆరోపించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ సమీపంలో ఉన్న ఓ ఫామ్ హౌజ్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరిపిందని మంత్రులు మండిపడ్డారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్.. '' ధన బలంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు పన్నుతున్న బీజేపి దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోంది'' అని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేస్తూ బుధవారం రాత్రి రోడ్డెక్కి నిరసన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు వ్యతిరేకంగా బీజేపి ఎన్ని కుట్రలు చేసినా.. బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న ఆయన ఎదుగుదలను ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. 


కేసీఆర్ ముందు మీ ఆటలు సాగవు..
బీజీపీకి ప్రజాస్వామ్య విలువలు లేవని.. టీఆర్ఎస్‌ పార్టీని రాజకీయంగా ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతోనే ఇలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం లాంటి అడ్డదార్లు ఎంచుకుందని మంత్రులు బీజేపిపై విరుచుకుపడ్డారు. సిగ్గు ఎగ్గు  లేకుండా ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నం చేసింది కానీ టీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అలా అమ్ముడుపోయే రకం కాదని హితవు పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల ఆటలు సాగవు అన్నారు. ధన బలంతో ఇలాంటి రాజకీయాలకు తెరతీస్తున్న బీజేపీని మునుగొడు ఉప ఎన్నికలో బొంద పెట్టాలని మునుగోడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 


కేసీఆర్ ముందు నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఎంతన్న మంత్రులు
బీజీపీకి రోజులు దగ్గర పడ్డాయని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. ధన బలంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొని ఇతర రాష్ట్రాల్లో ఎలాగైతే ప్రభుత్వాలను కూల్చారో.. అలాగే తెలంగాణలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుల్చేందుకు బీజేపి కుట్ర చేస్తోందని.. కానీ కేసీఆర్ సర్కారును కూల్చడం ఎవరి తరం కాదని మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఉద్దండులతో ఢీకొట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఓ లెక్క కాదని కొట్టిపారేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ ( CM KCR ) బీజీపీ ఢిల్లీ పీఠం బద్దలు కొట్టడం ఖాయం అని హెచ్చరించారు.


Also Read : BJP Deal With TRS MLAs: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంపై ధర్మపురి సెటైర్లే సెటైర్లు


Also Read : Deal With TRS MLAs: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బ్రోకర్ల మంతనాలు.. ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల డీల్ !


Also Read : TRS MLAs Deal Issue: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలన్న స్కెచ్ అందుకే: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి