EX Minister Harish Rao: హరీష్ రావుకు బంపర్ ఆఫర్.. కాంగ్రెస్ లోకి వస్తే దేవాదాయ శాఖ..?.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్ కీలక నేత..
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది. ముఖ్యంగా కృష్ణానది ప్రాజెక్టుల పై రచ్చ కొనసాగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చారు.
Komati Reddy Rajagopal Reddy Offers To Harish Rao: తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ లు, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ వాడివేడిగా సాగింది. సాగునీటి ప్రాజెక్టులపై పాపం.. బీఆర్ఎస్ పార్టీదని కాంగ్రెస్ ఆరోపించింది. మరోక వైపు మాజీ మంత్రి హరీష్ రావు దీన్ని గట్టిగానే తిప్పికొట్టారు. ఇదిలా ఉండగా.. మనుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read More: Honey Rose: రెడ్ ట్రెండ్ ని ఫాలోఅయిన హనీ రోజ్.. కానీ కొంచెం డిఫరెంట్ గా!
మాజీ మంత్రి హరీష్ రావు.. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే దేవాదాయ మంత్రి పదవి ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ లో ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు.. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని మాట్లాడారు. బీఆర్ఎస్ లో ఉన్న హరీష్ కుప్రయోజనం లేదని, కాంగ్రెస్ లోకి వస్తే ఆయనను మంత్రి పదవి ఇచ్చి గౌరవిస్తామన్నారు. అదేవిధంగా ఒక 25 మంది ఎమ్మెల్యేలను మాత్రం తీసుకురావాలని కండీషన్ పెట్టారు.
బీఆర్ఎస్ లో చేసిన పాపాలు.. కడుక్కొవడానికి దేవాదాయ శాఖను కట్టబెడుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. హరీష్ రావు, కడియంలా పదవుల కోసం పాకులాడమని అన్నారు. ఉద్యమ చరిత్రలో పదవులను త్యాగం చేసిన వాళ్లమని రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు.
Read More: Mouni Roy: 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ కొత్త అవతారం.. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా..
అదే విధంగా నల్లగొండ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అవుతుందని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. హరీష్ రావుకు మా పార్టీలో మాత్రమే మంచి ఫ్యూచర్ ఉందని ఆయన వస్తే తప్పకుండా మంచి పదవిచ్చి గౌరవిస్తామని ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook