పదవికి ఐపీఎస్ వీకే సింగ్ రాజీనామా
ప్రభుత్వంలో కంటే బయటే తన సేవలు అవసరమని, అందుకే తన పదవీకి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్(IPS VK Singh) తన రాజీనామా లేఖలో అభిప్రాయపడ్డారు.
ఎన్నో ఆశయాలతో పోలీసు శాఖలో చేరానని, కానీ శాఖలో మార్పులు తేవాలని భావించినా... చివరకు విఫలమయ్యానని, ప్రభుత్వంలో కంటే బయటే తన సేవలు అవసరమని, అందుకే తన పదవీకి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ తన రాజీనామా లేఖలో అభిప్రాయపడ్డారు. నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్
తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్ (Telangana police academy director), సీనియర్ ఐపీఎస్ (IPS) అధికారి వినోయ్ కుమార్ సింగ్ (vk singh ips) స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతించాలని కోరుతూ తన రాజీనామా లేఖను బుధవారం కేంద్ర హోం శాఖ (Ministry of Home Affairs) కు పంపించారు. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున పదవీ విరమణకు అవకాశమివ్వాలని కేంద్రాన్ని కోరారు. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎన్నో ఆశయాలతో పోలీసు శాఖలో చేరానని, మార్పులు తేవాలని భావించి విఫలమయ్యానంటూ ఆవేదన వ్యక్తంచేశారు. హృతిక్ రోషన్ అద్దె కూడా చెల్లించలేడు: కంగనా రనౌత్
తన సేవల పట్ల తెలంగాణ ప్రభుత్వం (Government of Telangana) సంతృప్తిగా లేదని, అందుకే భారం కాదల్చుకోలేదని వీకేసింగ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో కంటే బయటే తన సేవలు అవసరమని, తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. ప్రజల్లో మార్పు కోసం పనిచేస్తానని తెలిపారు. పదవీ విరమణకు మూడు నెలల ముందే నోటీసు ఇవ్వాలన్న నిబంధన మేరకు తాను లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర
కొద్దిరోజుల క్రితం సీఎస్ కు లేఖ..
గత కొంతకాలంగా వీకే సింగ్ తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పదోన్నతి విషయంలో తనకు అన్యాయం జరుగుతుందని, అర్హత ఉన్నా డీజీపీగా పదోన్నతి ఎందుకు కల్పించలేదంటూ కొద్ది రోజుల క్రితం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ