హృతిక్ రోషన్ అద్దె కూడా చెల్లించలేడు: కంగనా రనౌత్

తన మాజీ బాయ్ ఫ్రెండ్‌గా చెప్పుకునే స్టార్ హీరో హృతిక్ రోషన్‌ను లక్ష్యంగా చేసుకుని మరోసారి వివాదానికి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) తెరలేపింది.

Last Updated : Jun 24, 2020, 03:51 PM IST
హృతిక్ రోషన్ అద్దె కూడా చెల్లించలేడు: కంగనా రనౌత్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) తన మాజీ బాయ్ ఫ్రెండ్‌గా చెప్పుకునే స్టార్ హీరో హృతిక్ రోషన్‌ను లక్ష్యంగా చేసుకుని మరోసారి వివాదానికి తెరలేపింది. వీరి మధ్య మాటలతూటాలు ఎప్పుడు పేలిన అది బాలీవుడ్ వర్గాల్లో, అటు అభిమానుల్లో సంచలనంగా మారుతుంది. అయితే మరోసారి కంగనా, హృతిక్ రోషన్‌ను ఎందుకు టార్గెట్ చేసింది, ఆ వివరాలపై ఓ లుక్కేయండి. India COVID-19 Cases: దేశాన్ని కలవరపెడుతున్న కరోనా

బాలీవుడ్‌ (Bollywood)లో వివాదాల గురించి చూస్తే వాటిలో కంగనా రనౌత్ (Kangana Ranaut), సూపర్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan) వివాదం ఒకటి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. వీరి వివాదం నిప్పురవ్వలా మండుతూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం కంగనా వారసత్వం, బంధుప్రీతి (Nepotism) గురించి మాట్లాడుతూ హృతిక్‌పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సారి కంగనా మరో అడుగు ముందుకేసి హృతిక్ తండ్రి  రాకేష్ రోషన్(Rakesh Roshan) పేరు ప్రస్తావించడంతో హాట్ టాపిక్ అవుతోంది. పతంజలి కరోనా మెడిసిన్ Coronil.. ధరెంతో తెలుసా!

మా అనుబంధ వెబ్సైట్ Bollywoodlife.Com ప్రకారం.. కంగనా ఒక ఇంటర్వూలో తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు తాను ‘డబ్బు అత్యాశ’ లాంటి ట్యాగ్ లైన్లను  విన్నానని, కానీ ఇప్పుడు తనకు ముంబైలో సొంత ఇల్లు, విలాసవంతమైన ఆఫీసు ఉన్నందుకు గర్వపడుతున్నట్లు పేర్కొంది. అయితే తన మాజీ బాయ్‌ఫ్రెండ్ హృతిక్ రోషన్ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాడని, దాని అద్దెను అతని తండ్రి రాకేష్ రోషన్ చెల్లిస్తున్నాడని ఎద్దెవా చేసింది.  అన్నిచోట్ల బంధుప్రీతి... సుశాంత్ ఆత్మహత్యపై స్పందించిన రేణుదేశాయ్..

‘కెరీర్ ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ తర్వాత నా జర్నీ సాఫీగా సాగింది. ఇప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. కొంతకాలం కిందట హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో వివాదం జరిగింది. న్యాయపోరాటం చేస్తే డబ్బులు కోసం చేస్తున్నానని చిత్రీకరించే యత్నం చేశారు. కానీ ఈరోజు నేను సొంత ఇంట్లో ఉంటున్నారు. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. కానీ హృతిక్ ఇంకా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడి తండ్రి అద్దె చెల్లిస్తున్నాడు తెలుసా. నేను డబ్బు కోసం పాకులాడటం లేదని చెప్పేందుకు ఇది చాలనుకుంటా’ అంటూ మరోసారి హృతిక్ రోషన్ లక్ష్యంగా కంగనా రనౌత్ కామెంట్లు చేసింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News