Big Twist For MLA Danam Nagender And kadiyam Srihari: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే టీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు, బీఆర్ఎస్ లోకి వరుసపెట్టి జాయిన్ అయిపోతున్నారు. ఇప్పటికే ఎంపీ,  ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. కడియం శ్రీహరి,కే కేశవరావు వంటి సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేశారు. స్పీకర్ ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వంను రద్దు చేయాలని కూడా వినతిపత్రం కూడా ఇచ్చారు. అదే విధంగా పార్టీలు మారిన నేతలను తిరిగి తమ పార్టీలలో రానిచ్చేది లేదని కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రొత్సహిస్తుందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: BRS To TRS: బీఆర్ఎస్ పేరును మార్చే ఆలోచనలో ఉన్నాం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి..


ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ హైకమాండ్ ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మెజిఫెస్టోలో న్యాయ్ పత్ర పేరిట ప్రజలపై వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ సీనియర్‌ నాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ మేనిఫెస్టోను  ఢిల్లీలో విడుదల చేశారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన 'భారత్‌ జోడో యాత్ర'లో ప్రకటించిన ఐదు న్యాయాలతోపాటు 25 గ్యారంటీలను కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించింది.దీనితో పాటు ఇదే మేనిఫెస్టోలో.. పదవ షెడ్యూల్ లో మార్పులకు పలు సవరణలు అవసరమని పేర్కొన్నారు. ఈక్రమంలో ముఖ్యంగా ఒక పార్టీగుర్తుమీద గెలిచి మరోక పార్టీలోకి జంప్ అయ్యే నేతలు.. తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మరో పార్టీలోకి చేరేలా చట్టసవరణ తీసుకురానున్నారు.


అదే విధంగా ఆయాపార్టీలు కూడా సదరు నేతలు రాజీనామాలు చేసిన తర్వాత మాత్రమే, మరో పార్టీలోకి జాయిన్ చేసుకొవాలంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ప్రస్తుతం ఇది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన దానం, కడియంలకు బిగ్ ట్విస్ట్ లాగా మారింది. ఈ ఇద్దరు నేతలు.. తమ పదవులకు రాజీనామాలు చేరకుండానే మరో పార్టీలోకి చేరారు. దీనిపై ఈ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరికొంత కాలం వేచిచూడాల్సి ఉంటుంది.


Read More: Python Climb Tree: భారీ చెట్టును సెకన్లలో ఎక్కేసిన కొండ చిలువ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..


అయితే.. తాజాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదవ షెడ్యూల్ మార్పుల సవరణలపై చేసిన వ్యాఖ్యలపై, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా...కాంగ్రెస్ పార్టీఎప్పటిలాగే చెప్పేదోకటి.. చేసేది మరోకటి అంటూ కేటీఆర్ తన దైన స్టైల్ లో సెటైర్ వేశారు. రాహుల్ కు  చిత్త శుధ్దీ ఉంటే, పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, స్పీకర్ తో అనర్హులుగా ప్రకటించాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook