TS Graduate MLC Election 2024 Polling: తెలంగాణలో మరో కీలక ఘట్టం జరుగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు జిల్లాల పరిధిలోని పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గ్రాడ్యుయేషన్ ఉప ఎన్నికలలో సిట్టింగ్ స్థానాన్ని మరొసారి కైవసం చేసుకొవాలని బీఆర్ఎస్ కేటీఆర్ సారథ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి గ్రాడ్యుయేషన్ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఇక కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మరోసారి తనదైన శైలీలో పావులు కదుపుతున్నారు. ఈ ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో  గెలిపించుకునే విధంగా ప్రచారం నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..


బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా ఈ స్థానంలో 52 మంది పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారే ప్రజలు తమకు పట్టం కడతారని, ఆయా పార్టీల  నేతలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో.. పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారోననే విషయంలో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుంటే ఎమ్మెల్సీ ఎన్నిక కోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎన్నికల రోజు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఆయా జిల్లాల పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు ఎన్నికల సంఘం ఇప్పటికే సెలవు ప్రకటించింది. ఇక ప్రైవేటు ఉద్యోగులు పనివేళల్లో మార్పులు చేసుకుని, పర్మిషన్ లు తీసుకుని వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొవాలని ఈసీ కోరింది.


ఈ మేరకు ప్రైవేటు కంపెనీలకు ఉద్యోగులకు వెసులుబాటు ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్  ప్రభుత్వం ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే ఆయా జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కీలకనేతలలో పట్టభద్రులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది.


తెలంగాణను పోరాడీ సాధించిన పార్టీగా, ప్రజల్లోకి వెళ్లి సెంటిమెంట్ తో టచ్ చేయడానికి ప్రయత్నించింది. ఈ మేరకు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికను ఒక రెఫరెండమ్ గా  తీసుకుని పూర్తి బాధ్యతలు పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఆ తరువాత నేరుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా తనదైన స్టైల్ లో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.


Read more: Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..


12 జిల్లాల పరిధిలో.. 605 పోలింగ్ కేంద్రాలు.. 


వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 12 జిల్లాల పరిధిలో మొత్తంగా 34 నియోజకవర్గాలున్నాయి. మొత్తంగా 4,61,806 మంది పట్టభద్రులు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.  వీరిలో.. పురుషులు 2,87,007 మంది, మహిళలు 1,74,794 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. 27వ తేదీ సోమవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగనుంది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter